అమరావతి మార్చి 22:—
రాష్ట్ర పర్యాటక,యువజనసంక్షేమం, సాంస్కృతిక, క్రీడల శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు (అవంతి)తో నేషనల్ క్యాడెట్ క్రాప్స్ (NCC) ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల డిప్యూటీ డైరక్టర్ జనరల్ పి. మహేశ్వర్ భేటీ అయ్యారు. మంగళవారం వెలగపూడి సచివాల
యంలో ఆయన మంత్రి అవంతి శ్రీనివాస్ ను మర్యాద పూర్వకంగా కలుసుకున్నారు. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఎన్ సిసి కార్యక్రమాల
గురించి ఆయన మంత్రికి వివరించారు. దేశం లోని మిగతా రాష్ట్రాల కన్నా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లోనే 80వేల మంది క్యాడెట్లు ఉన్నారని
మహేశ్వర్ తెలియజేశారు. రాష్ట్రంలో ఎన్ సిసి కి బడ్జెట్ కేటాయింపులు పెంచాలని మహేశ్వర్ కోరగా అందుకు మంత్రి అవంతి శ్రీనివాస్ సానుకూలంగా
స్పందించారు. మంత్రి అవంతిని కలసినవారిలో కల్నల్ శ్రీనివాస్, ఇతర అధికారులు ఉన్నారు.
Tags amaravathi
Check Also
ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కాకినాడ పర్యటన…
రాజానగరం / రంగంపేట, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ర్ట ఉప ముఖ్యమంత్రి కొణిదల పవన్ కళ్యాణ్ శుక్రవారం ఉదయం …