విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లాలో వస్తువుల తయారీ పరిశ్రమల ( మ్యానుఫ్యాక్చరింగ్) యూనిట్ల స్థాపనకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని, ఆ పరిశ్రమల స్థాపనకు ముందుకు వచ్చే పారిశ్రామిక వేత్తలను ప్రొత్సహించాలని జిల్లా కలెక్టర్ జె నివాస్ అన్నారు. నగరంలోని కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో బుధవారం జిల్లా పరిశ్రమల మరియు ఎగుమతి ప్రొత్సాహక కమిటీ ీ(డిఐఇపిసి) సమావేశం కమిటీ చైర్మన్, జిల్లా కలెక్టర్ జె.నివాస్ అధ్యక్షతన నిర్వహించారు.ఈ సమావేశంలో కలెక్టర్ జె.నివాస్ మాట్లాడుతూ సేవా రంగానికి (సర్వీస్ ఇండస్ట్రీస్) సంబంధించిన యూనిట్ల కంటే వస్తువుల తయారీ పరిశ్రమల యూనిట్లకు జిల్లా పరిశ్రమల సంస్థ ప్రాధాన్యతనిచ్చి ఆ రంగాలను ప్రొత్సహించించాలని సూచించారు. పరిశ్రమల స్థాపనకు సమర్పించే ధరఖాస్తులను పరిష్కారించేందుకు వీలుగా ఏర్పాటు చేసిన సింగిల్ డెస్క్ ప్రతిపాదనలను సకాలంలో పరిష్కారించాలన్నారు. చల్లపల్లి` ఆటోనగర్ పారిశ్రామిక కేంద్రంలో ఆటోమొబైల్ రంగానికి సంబంధించిన పరిశ్రమల స్థాపనకు వచ్చిన 15 ప్రతిపాదనలలో ఔత్సాహిక పరిశ్రమిక వేత్తలకు ఒక్కోక్కరికి 51 గజాలు స్థలాన్ని కేటాయించేందుకు, జగ్గయ్యపేట మండలం వేదాద్రిలో బల్క్ డ్రగ్ యూనిట్ నెలకొల్పెందుకు ఆక్టానెక్స్ లైఫ్ సైన్స్‌స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనికి 5 ఏకరాల భూమిని కేటాయించేందుకు కమీటి అమోదం తెలిపింది. జగనన్న బడుగు వికాసం పథకంలో సూక్ష చిన్న మధ్యతరహ పరిశ్రమలల్లో భాగంగా పెట్టుబడి రాయితీ, విద్యుత్ రాయితీ, అమ్మకపన్ను రాయితీ, పావలా వడ్డీ రాయితీలకు క్లయిమ్ సమర్పించిన 170 ప్రతిపాదనలకు 8 కోట్ల 40 లక్షల 6 వేల 797 మంజూరుకు కమిటీ అమోదం తెలిపింది. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ ( సంక్షేమం) కె. మోహన్‌కుమార్, జిల్లా పరిశ్రమల శాఖ జనరల్ మేనేజర్ ఏ సధాకర్, ఏపి ఐఐసి జోనల్ మేనేజర్ శ్రీనివాస్‌రావు, ఎల్‌డియం రాంమోహన్‌రావు, డిపివో జ్వోతి, సాంఘిక సంక్షేమ శాఖ డిడి కె. సరస్వతి, డిఎఫ్‌ఓ శ్రీనివాస్‌రెడ్డి, జిల్లాకు చెందిన ఔత్సాహిక పరిశ్రమిక వేత్తలు పాల్గొన్నారు.
Tags vijayawada
Check Also
ప్రతి నెలా చేనేత ఎగ్జిబిషన్లు ఏర్పాటు
-మంత్రి సవిత వెల్లడి -నికె హ్యాండ్లూమ్ మార్కెటింగ్ ఎక్స్ పో 2024-25 ను ప్రారంభించిన మంత్రి -నేతన్నలకు 365 రోజులు …