విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్ర షెడ్యూల్ తెగల కమీషన్ ఛైర్మన్ కె.రవిబాబు గురువారం ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ను మర్యాద పూర్వకంగా కలిసారు. విజయవాడ రాజ్ భవన్ వేదికగా జరిగిన ఈ సమావేశంలో రవిబాబు గవర్నర్ కు కమీషన్ పరిధిలో చేపడుతున్న విభిన్న కార్యక్రమాలను గురించి వివరించారు. రాజ్యాంగ బద్దంగా షెడ్యూల్ తెగలకు అందవలసిన హక్కుల విషయంలో కమీషన్ తగిన పాత్ర పోషిస్తుందన్నారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ షేడ్యూలు తెగలకు ప్రభుత్వ పధకాలు పూర్తిగా చేరేలా బాధ్యత తీసుకోవాలని సూచించారు. రాష్ట్రంలో ఎస్ టి జనాభా ఎంత అన్న విషయంపై అరా తీసారు. కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాలు ఎస్టి తెగల సంక్షేమం కోసం విభిన్న పధకాలు అందిస్తున్నాయని వాటిని సద్వినియోగం చేసుకోవటం ద్వారా సమాజంలో అర్ధిక స్వావలంబన సాధించాలని సూచించారు. ఈ సమావేశంలో గవర్నర్ వారి ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్ పి సిసోడియా, సంయిక్త కార్యదర్శి శ్యామ్ ప్రసాద్, ఉప కార్యదర్శి సన్యాసి రావు తదితరులు పాల్గొన్నారు.
Tags vijayawada
Check Also
ప్రతి నెలా చేనేత ఎగ్జిబిషన్లు ఏర్పాటు
-మంత్రి సవిత వెల్లడి -నికె హ్యాండ్లూమ్ మార్కెటింగ్ ఎక్స్ పో 2024-25 ను ప్రారంభించిన మంత్రి -నేతన్నలకు 365 రోజులు …