టీడీపీ సెంట్రల్ నియోజకవర్గ బీసీ సెల్ నూతన కమిటీ ప్రమాణ స్వీకార సభ…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
టీడీపీ సెంట్రల్ నియోజకవర్గ బీసీ సెల్ నూతన కమిటీ ప్రమాణ స్వీకార సభ గురువారం గాంధీనగర్ లోని షణ్ముఖ ఫంక్షన్ హాల్ నందు జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా టీడీపీ పొలిట్బ్యూరో సభ్యులు, Ex.MLA బోండా ఉమామహేశ్వరరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బొండా ఉమ మాట్లాడుతూ బిసిలకు తెదేపా ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇచ్చింది. టీడిపి హయాంలో బీసీ కార్పరేషన్ కి నిధులు కేటాయించి సంక్షేమ పథకాలు అమలు చేసాము.. బాక్వార్డు క్లాస్ కాదు బ్యాక్ బోన్ క్లాస్ గా ప్రాధాన్యత ఇచ్చిన ఘనత టీడీపీది. 3సంవత్సరాల పాలనలో వైకాపా ప్రభుత్వం బిసి కార్పొరేషన్ కు ఎన్ని నిధులు కేటాయించారో వైట్ పేపర్ విడుదల చేయాలి అన్నారు. బిసి లకు ఒక్క రూపాయి కూడా రుణాలు ఇచ్చిన దాఖలాలు లేవు అని, విదేశీ విద్యా ,స్కాలర్షిప్, ఫీజులు రేయింబర్సుమెంట్ కు దూరం చేశారు అని మండిపడ్డారు.. ఆర్భాటంగా 60 కోట్లు ప్రకటనలు ఇచ్చారు,కానీ ఒక్క రూపాయి కూడా నిధులు మంజూరు చేయలేదు. ఏర్పాటు చేసిన కార్పొరేషన్ లలో కూర్చోడానికి ,కుర్చీలు, లేని పరిస్థితి ఉంది అన్నారు.. చైర్మన్లు సొంత ఖర్చులతో కార్యాలయాలు నడుపుతున్నారు అని, బిసి కార్పొరేషన్ ద్వారా ఎన్ని సంక్షేమ పధకాలు అమలు చేశారు శ్వేత పత్రం విడుదల చేసే దమ్ముందా అని ప్రశ్నించారు.. బిసి ల పొట్ట కొట్టింది జగన్మోహన్ రెడ్డి కాదా?? 50 శాతం ఉన్న బిసిలకు ఎన్ని నిధులు కేటాయించారో చెప్పాలి… ప్రశ్నించే వారిపై ఉక్కు పాదం మోపుతూ అణచివేత ధోరణితో చూస్తున్నారు అని, ఐకమత్యంగా ఉండే బీసీలను కులాల వారీగా జగన్మోహన్ రెడ్డి విడదీశారు అన్నారు. ఇప్పటికైనా bc కార్పొరేషన్ కు నిధులు మంజూరు చేసి ఆదుకొకపోతే బిసి లు ఐకమత్యంతో పోరాడి రాబోయే కాలంలో వైకాపాకు బుద్ధి చెబుతారు అని హెచ్చరించారు. అనంతరం బోండా ఉమ సమక్షంలో సెంట్రల్ నియోజకవర్గ టీడీపీ bc cell అధ్యక్షుడిగా ఇప్పిలీ మోహన్, ప్రధాన కార్యదర్శి గా పిరియా సోమేశ్వర రావు లతో పాటు 180మంది కమిటీ సభ్యులతో ప్రమాణస్వీకారం చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి నవనీతం సాంబశివరావు, TNTUC రాష్ట్ర అధ్యక్షుడు గొట్టుముక్కల రఘురామ రాజు, టీడీపి ఫ్లోర్ లీడర్ నెలిబండ్ల బాల స్వామి, కార్పొరేటర్ చెన్నగిరి రామ్మోహనరావు, మాజీ ఫ్లోర్ లీడర్ ఏరుబోతు రమణ,రాష్ట్ర నాయకుడు నందెటి భాను సింగ్, పార్లమెంట్ bc cell అధ్యక్షుడు కాకు మల్లికార్జున యాదవ్, నేతలు దివి ఉమ, కంచి ధన శేకర్, పరుచూరి ప్రసాద్, దాసరి కనకారావు, చలమలశెట్టి శ్రీను, pvr, మసిముక్కు శ్రీనివాస్ యాదవ్, బెజావాడ తిరుపతి రావు, భవిరి సింహాచలం, వల్లూరు మధుసూదన రావు, సర్వేపల్లి అమర్నాథ్ గౌడ్, ఇప్పులి వరాలు, ఆల రామారావు, సింగం వెంకన్న, పడమటి రామకృష్ణ, మరియు నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రతి నెలా చేనేత ఎగ్జిబిషన్లు ఏర్పాటు

-మంత్రి సవిత వెల్లడి -నికె హ్యాండ్లూమ్ మార్కెటింగ్ ఎక్స్ పో 2024-25 ను ప్రారంభించిన మంత్రి -నేతన్నలకు 365 రోజులు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *