విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఎన్‌లైట్ కన్సల్టెన్సీ మేనేజ్‌మెంట్ 4వ వార్షికోత్సవ వేడుకల సందర్భంగా విద్యార్దులకు చాలా సులభంగా కావలసిన సమాచారం కోసం ‘వెబ్‌సైట్’ను ప్రారంభించారు. బందరు రోడ్డు సమీపంలోని లక్షీపురంలోని తమ కార్యాలయంలో ఆదివారం ముఖ్య అతిధిగా విచ్చేసిన ఎపి రాష్ట్ర కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ ఛైర్మన్ ప్రొ. కె.హేమచంద్రారెడ్డి ప్రారంభించి నేటి పరిస్థితులలో ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్ళే విద్యార్దులకు ఎన్‌లైట్ కన్సల్టెన్సీ ఇచ్చే సహాయ సహకారాలను అభినందించారు. దీనివలన వారి భవిష్యత్ ఉన్నతికి దోహదపడుతుందన్నారు. సంస్థ ఎండి యార్లగడ్డ శ్రీహర్ష మాట్లాడుతూ ఆర్థిక అవరోధాలు, సరైన మార్గదర్శకత్వం లేని కారణంగా ఎంతో మంది తెలివైన విద్యార్థులు విదేశాల్లో విద్యను అభ్యసించలేకపోతున్నారని, వారి కలను నెరవేర్చడానికి లాభాపేక్షలేకుండా మావంతు సహాయ సహకారాలు అందజేయడానికి కృషి చేస్తున్నామన్నారు. పేద విద్యార్థుల చదువుల కోసం ఆర్థిక సహాయం అందించడమే కాకుండా, ప్లేస్‌మెంట్లు మరియు పిఆర్‌లను పొందడం కోసం కూడా సహాయ సహకారాలు అందిస్తున్నామన్నారు. ఇంజనీరింగ్, ఫార్మసీ, నర్సింగ్, బిబిఎ, ఎంబిఎ, 12వ తరగతి తదితర విదేశాలలో చదువుకోసం ప్రత్యేక రాయితీలతోపాటు ఐఇఎల్‌టిఎస్, పిటిఇ, టోఫెల్, జిఆర్‌ఇ, ఎస్‌ఎఎస్ తదితర కోచింగ్‌లలో ప్రత్యేక ఆఫర్స్‌ను విద్యార్దులకు అందజేస్తున్నామన్నారు. మేనేజర్, ఇన్‌ఛార్జ్ మన్నె పవన్‌కుమార్ మాట్లాడుతూ తమ సంస్థ ఎబ్రాడ్, యూకె, కెనడాలతోపాటు ఇప్పుడు ఇండియాలో మొదటి బ్రాంచ్ అని అన్నారు. ఇప్పటి వరకు సుమారు 500 మందిని పంపించామని, ఇక ఇప్పటి నుండి వెయ్యిమందిని పంపే ఆలోచనలో వున్నట్లు తెలిపారు. భవిష్యత్‌లో హైదరాబాద్, వైజాగ్, నెల్లూరు బ్రాంచ్‌లు స్థాపించే ఆలోచనలో వున్నట్లు తెలిపారు. ఎన్‌లైట్ కన్సల్టెన్సీ ఛైర్మన్ ప్రొఫెసర్ యార్లగడ్డ విజయలక్ష్మి మాట్లాడుతూ మార్చి 2018లో ఎన్‌లైట్ కన్సల్టెన్సీని ప్రారంభించామని మొదటిసారి విదేశీ ప్రయాణం చేసేవారికి విమానాశ్రయం పికప్ మరియు వసతి ఏర్పాటువరకు అందజేస్తున్నామన్నారు. ఈ సంస్థ ప్రపంచంలోని వందలాది విశ్వవిద్యాలయాలతో నేరుగా టై-అప్‌లను కలిగి ఉంది. మహమ్మారి సమయంలో, వారు యుకె.యుఎస్‌ఎ మరియు కెనడాలోని ప్రతి విద్యార్థికి 2 నెలల పాటు కిరాణా సామాగ్రిని సరఫరా చేయడం ద్వారా స్వచ్ఛంద సేవా కార్యక్రమాలను నిర్వహించామన్నారు. ఈ ‘వెబ్‌సైట్’లో చాలా సులభంగా మీకు కావలసిన సమాచారం పొందుపరచబడిందన్నారు. భవిష్యత్తులోనూ విద్యార్థులకు మరియు సమాజానికి ఇలాంటి సేవలు కొనసాగించాలని వారిని మనస్పూర్తిగా కోరుకుంటున్నానన్నారు. ఈ కార్యక్రమంలో 4వ డివిజన్ కార్పొరేటర్ జాస్తి సాంబశివరావు, వైఎన్‌ఆర్ ఛారిటీస్ యలమంచిలి జయప్రకాష్, రోటరీ పాస్ట్ డిస్ట్రిక్ట్ గవర్నర్ డాక్టర్ ఎం.వి.సాంబశివరావు, విద్యార్దులు, సిబ్బంది పాల్గొన్నారు.
Tags vijayawada
Check Also
గత ప్రభుత్వానిది స్కాముల్లో రికార్డు… కూటమి ప్రభుత్వానిది స్కీమల్లో రికార్డు
-పాడి రైతులు న్యూజిలాండ్ తరహాలో ప్రగతి సాధించాలి -గత ప్రభుత్వంలో నాయకుల సొంత డెయిరీలను పెంచుకున్నారు -తిరుపతి దుర్ఘటన విషయంలో …