-మిస్బా ఘటన చాలా దుర దృష్ట కరం
-ఘటనకు బాధ్యు లైన వారిపై కఠిన చర్యలు తీసుకుం టాం
-ఇలాంటి ఘటన లు పునరావృతం కాకుండా చర్యలు చేపడతాం
-బాధిత కుటుంబా నికి ప్రభుత్వం అండ గా నిలు స్తుంది
-రాష్ట్రపంచాయతీ రాజ్ గ్రామీ ణాభివృద్ధి శాఖ మంత్రి
పలమనేరు, నేటి పత్రిక ప్రజావార్త :
పలమనేరు లో ఇటీవల ఆత్మహత్య చేసుకున్న విద్యార్థిని మిస్బా కుటుంబానికి ప్రభుత్వం అండగా నిలుస్తుందని రాష్ట్ర పంచాయతీ రాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి డా. పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం మధ్యా హ్నం పలమనేరు లో ఇటీవల ఆత్మహత్య చేసుకున్న విద్యార్థిని మిస్బా కుటుంబాన్ని మంత్రి పరామర్శిం చారు. మంత్రి తో జెడ్పీ చైర్మన్ గోవిందప్ప శ్రీనివాసులు, పలమనేరు,మదనపల్లి శాసన సభ్యులు వెంకటే గౌడ్, మదనపల్లి ఎమ్మెల్యే నవాజ్ బాషా,జిల్లా కలెక్టర్ యం. హరి నారాయణన్,డిసిసిబి చైర్ పర్సన్ రెడ్డమ్మ,మదనపల్లె ఆర్ డి ఓ మురళి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మీడి యా తో మంత్రి మాట్లాడుతూ మిస్బా కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని మిస్బా కుటుంబానికి అండ గా ఉంటుందని.. మిస్బా ఆత్మహత్య ఘటన చాలా దుర దృష్ట కరమని అన్నారు..మంచి చదవరి, స్కూల్ టాపర్ గా మిస్బా రాణించిందని, పేద రికాన్ని ఎత్తి చూపు తున్నారని మరియు అవమానిస్తున్నారని, క్షణికావేశంలో ఆత్మ హత్య చేసు కోవడం చాలా బాధాకరమన న్నారు.బాధిత కుటుంబానికి మేము పూర్తి సహాయ సహ కారాలు అందిస్తా మని..మరియు ఈ సంఘటన కుబాధ్యు లు అయిన వారి పై కఠిన చర్యలు తీసు కుంటామని,స్కూల్ యాజమాన్యం పైన కూడా చర్యలు తీసు కుంటామని,ప్రభుత్వ పరంగా పూర్తి సహ కారం అందిస్తామని తెలిపారు.నాతో పాటు ఎమ్మెల్యే వెంకటే గౌడ్, ఎంపి రెడ్డప్ప అందరం ఈ కుటుంబానికి అండ గా ఉంటామని,ఈ అంశం గౌ.రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వై.ఎస్. జగన్ మోహ న్ రెడ్డి గారి దృష్టి లో కూడా ఉన్నదన్నారు. భవిష్యత్తులో ఇలాం టి సంఘటనలు పునరావృతం కాకుం డా ప్రభుత్వం కఠినం గా వ్యవహరిస్తుంద నన్నారు. మంత్రి గారి తో మున్సిపల్ చైర్ పర్సన్ పవిత్ర మురళి కృష్ణ,సమగ్ర శిక్ష ఎ టి సి వెంకట రమణా రెడ్డి, పలమ నేరు మునిసిపల్ కమిషనర్ కిరణ్ కుమార్, తహసీల్దార్ కుప్పస్వామి, సంబం ధించి అధికారులు పాల్గొన్నారు.