తిరుపతి,రుయా ఆసుపత్రి, నేటి పత్రిక ప్రజావార్త :
శనివారం రాత్రి ధర్మవరం నుండి తిరుపతి వెళు తున్న ప్రైవేట్ బస్సు అదుపు తప్పి భాకరాపేట ఘాట్ లోయ లో పడిన సంఘటన లో రుయా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి డా.పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆదివారం పరా మర్శించారు. క్షతగాత్రులకు అందిస్తున్న వైద్య సేవలను గురించి రుయా సూపరిం డెంట్ డాక్టర్ భారతి మంత్రి కి వివరించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని మంత్రి అధికారు లకు ఆదేశాలు జారీచేశారు. అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ ధర్మవరం నుండి పెళ్లి నిశ్చితార్థం కోసం తిరుపతికి వస్తున్న బస్సు భాకరాపేట ఘాట్ వద్ద బోల్తా పడి లోయలో పడి పోవడం జరిగిందని, ఈ సంఘటన జరిగిన వెంటనే జిల్లా కలెక్టర్, తిరు పతి ఎస్పీ, జాయిం ట్ కలెక్టర్ వెంటనే సంఘటన స్థలానికి చేరుకొని సహాయక చర్యలు పర్యవేక్షిం చడం జరిగిందని క్షతగాత్రులను రుయా,బర్డ్, స్వి మ్స్ ఆసుపత్రికి తరలించడం జరిగిందని, సంఘ టనా స్థలం వద్ద 7 మంది చనిపోవడం జరిగిందని ఒకరు ఆస్పత్రికి తరలించిన అనంతరం చని పోవడం జరిగిందని మిగిలిన వారందరి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నదని తెలిపారు. ఈ సంఘటన చాలా బాధాకరమని.. రాష్ట్ర ముఖ్య మంత్రి వై.యస్. జగన్మోహన్ రెడ్డి సంఘటనపై సమీక్ష చేసి చనిపోయిన వారందరికీ తక్షణ సహాయం కింద రెండు లక్షలు, చికిత్స పొందుతున్న వారికి రూ.50 వేలు ఆర్థిక సాయం ప్రకటించారని తెలిపారు. జిల్లా యంత్రాంగం సత్వరమే స్పందించి పూర్తిస్థాయిలో చర్యలు చేపట్టడం అభినందించదగ్గ విషయం అని… క్షత్రగాతుల కు పూర్తి స్థాయిలో వైద్య సేవలు అందించాలని ఆదేశించామని, తక్షణ సాయం అందించేందుకు చర్యలు చేపట్టా మన్నారు. భాకరాపేట ఘాట్ రోడ్డులో ఆర్ &బి శాఖ ద్వారా తాత్కాలికంగా రైలింగ్ ఏర్పాటు చేస్తామని..నాలుగు లైన్ల రోడ్డు కు పదిహేను వందల కోట్లతో టెండర్లు పిలవడం జరిగిం దని తెలిపారు. క్షతగాత్రులను పరామర్శించేందుకు మంత్రి వెంట టిటిడి పాలకమండలి సభ్యులు పోకల అశోక్ కుమార్, ఎన్ఆర్ఈజీఎస్ స్టేట్ కౌన్సిల్ మెంబర్ ముత్తంశెట్టి విశ్వనాథ్, జిల్లా జాయింట్ కలె క్టర్(అభివృద్ధి) శ్రీధర్, డిఎం & హెచ్ ఓ డా. శ్రీహరి తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News