విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రంలో ఉన్న ప్రతి పేద కుటుంబానికి కులమత పార్టీలకతీతంగా సంక్షేమ పథకాలు అమలు చేసి వారిని సామాజికంగా,ఆర్థికంగా ఉన్నత స్థానంలో నిలబెట్టడమే లక్ష్యం గా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిపాలన సాగిస్తున్నారు అని ఆ పార్టీ తూర్పు నియోజకవర్గ ఇన్ ఛార్జ్ దేవినేని అవినాష్ తెలిపారు.పార్టీ ఆదేశానుసారం చేపట్టిన గడప గడపకు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ కార్యక్రమంలో భాగంగా మంగళవారం 12వ డివిజన్ మౌలానా రోడ్డు, రఘు గార్డెన్స్,పప్పులమిల్లు మెయిన్ రోడ్డు నందు ఇంటిఇంటికి పర్యటించిన అవినాష్ సంక్షేమ పథకాలు అమలు తీరును వారికి వివరించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రజలకు సవివరంగా వివరించి పార్టీని ప్రజలకు మరింత చేరువ చేయడమే లక్ష్యంగా గడప గడపకు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు తెలిపారు. రోజురోజుకు ప్రభుత్వం మీద ప్రజలలో పెరుగుతున్న ఆదరణ చూసి ఓర్వలేక ప్రతిపక్ష టీడీపీ అసత్యాలు ప్రచారం చేస్తూ నీచ రాజకీయాలు చేస్తున్నారు అని విమర్శించారు. తెలుగుదేశం పార్టీ ఎన్టీ.రామారావు గారితోనే భూస్థాపితం అయిపోయింది అని అన్నారు. మీ ఎన్నుపోటు రాజకీయాలు జగన్మోరెడ్డి ప్రభుత్వంలో కుదరవు అని హెద్దేవా చేసారు. ప్రతిపక్షాలు చేసే తప్పుడు ప్రచారాలను గడప గడపుకు కార్యక్రమం ద్వారా ప్రజల్లోకి వెళ్లి వాస్తవాలు వివరించి ప్రభుత్వం వారికి అండగా ఉందని భరోసా ఇస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో వైస్సార్సీపీ నాయకులు రిజ్వాన్,కాళీ,ఖలీమ్,గుల్జర్,బాబురావు, చిన్న,ముక్కు వెంకటేశ్వర రెడ్డి కార్పొరేటర్లు అమర్నాథ్, రామిరెడ్డి, అంబేద్కర్, మాజీ డిప్యూటీ మేయర్ ఆళ్ల చెల్లారావు మరియు వైస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Tags vijayawada
Check Also
ప్రతి నెలా చేనేత ఎగ్జిబిషన్లు ఏర్పాటు
-మంత్రి సవిత వెల్లడి -నికె హ్యాండ్లూమ్ మార్కెటింగ్ ఎక్స్ పో 2024-25 ను ప్రారంభించిన మంత్రి -నేతన్నలకు 365 రోజులు …