-నయవంచన దినం.బ్లాక్ డేలో వినుకొండ రాజారావు ఆవేదన.
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్ర ఉద్యోగుల పదకొండవ పి.ఆర్.సి లో ఉద్యోగ సంఘాల నాయకులు సాధించిన విజయాలను నేటికీ ఉద్యోగ లోకానికి బహిరంగంగా చెప్పలేక పోవడం శోచనీయం,అని రాష్ట్రంలో కనీవినీ ఎరుగని రీతిలో ఉద్యోగులు ఫిబ్రవరి 3వ తేదీన విజయవాడ బీఆర్ టియస్ రోడ్డులో నిరసన గళం విప్పారని దీనిని విజయవంతం చేయడానికి రాష్ట్ర నలుమూలల నుండి అనేక రూపాలలో అనేక మార్గాలలో ఉద్యోగులు,ఉపాధ్యాయులు, అధికారులు, మహిళా ఉద్యోగులు, పెన్షనర్లు, కాంట్రాక్టు మరియు ఔట్ సోర్సింగ్ అనే తేడా లేకుండా లక్షలాదిగా తరలివచ్చి ఉవ్వెత్తున నిరసన గళం ఎగిసిపడింది అయితే ఉద్యోగులందరూ బిఆర్ టిఎస్ రోడ్డు పైకి వచ్చిన తర్వాత నాయకులు ఉన్నట్లుండి ప్రత్యక్షమై,పూనకం వచ్చినట్లు ఊగిపోయి కోడ్ ఆఫ్ కాండక్ట్ ను ఉల్లఘించి ప్రభుత్వాన్ని కించపరిచే వ్యాఖ్యలు,దూషణలు చేస్తూ సత్తా చూపిస్తామని,రాబోయే ఎన్నికల్లో వేసే ఓట్లు గురించి రాజకీయ ఉపన్యాసాలు చేసి మేము తలుసుకుంటే ప్రభుత్వాలు ప్రతిపక్షమే, ప్రభుత్వ ఉద్యోగులు మా బలం అని, హక్కులకోసం జరిగిన ఉద్యమాన్ని బలప్రదర్శనగా మార్చుకుని ప్రభుత్వ పెద్దల కనుసన్నల్లో పడడానికి విశ్వ ప్రయత్నం చేసి, ఉద్యోగుల ఆశలపై నీళ్లు చల్లి ఉద్యోగులు నిర్వహించిన నిరసన ర్యాలి తరువాత ఫిబ్రవరి ఆరో తేదీన. ప్రభుత్వం ప్రకటించిన దానికే ఒప్పందానికి వచ్చారని. రిపోర్ట్ లేకుండా వెళ్లి రాజ్యాంగ ఉల్లంఘన కు పాలుపడ్డారని,సాధించిన దానిని చెప్పక పోవడం.అటు ప్రభుత్వానికి ఇటు ఉద్యోగులను మోసం చేసిన రోజు 6వ.తేదని నయవంచన దినం బ్లాక్ డేగా ప్రకటిస్తున్నామని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సర్వీస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రతి నెల5 లేదా 6వ తేదీన రాష్ట్ర నాయకుల ఆధ్వర్యంలో ప్రతి జిల్లా కేంద్రంలో ఒక్కొక్క నెలలో ఒక్కొక్క జిల్లా మొత్తం26 జిల్లాల్లో నయవంచన దినం బ్లాక్ డే జరుపతలపెట్టామని దీని ద్వారా ఉద్యోగులను చైతన్యం చేసి మరో పి.ఆర్.సి లో అన్యాయం జరగకుండా కాపాడే ప్రయత్నం అని, ఉద్యోగ వ్యవస్థ కు భవిష్యత్తులో ముప్పు రాకుండా కాపాడుటకు ప్రయత్నం చేస్తున్నామని, అసమర్థ నాయకత్వం వల్లనే ఉద్యోగులకు హక్కులకు,విఘాతం కలిగిందని వీరినిర్ణయాలు శాపంగా మారాయని భవిష్యత్తులో ఇటువంటి అసమర్థ నాయకులు, పి.ఆర్. సి.లో ఉద్యోగులకు సాధించిపెట్టిన అంశాలు ఏమైనా ఉంటే వాటిని ఉద్యోగ లోకానికి చెప్పాలని రిపోర్టు లేకుండా వెళ్లిన నాయకులను చరిత్ర క్షమించదని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సర్వీస్ అసోసియేషన్ అమరావతి వారి ఆధ్వర్యంలో నేడు గుంటూరు పట్టణంలోని చుట్టుగుంట లో సంఘ కార్యాలయంలో నయవంచన దినం బ్లాక్ డే లో రాష్ట్ర అధ్యక్షుడు వినుకొండ రాజారావు ఆవేదన వ్యక్తం చేశారు .
ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి కొండపల్లి శ్రీనివాసరావు,రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్ పి.సిద్దార్థ, బాపట్ల జిల్లా అధ్యక్షుడు కె.సత్యం రాజు,కృష్ణా జిల్లా అధ్యక్షుడు కోటారవి,కె.వెంకటేశ్వరరావు, టి.విజయ్ కుమార్, బి.సురేష్ వై.కొండారెడ్డి, యం శశి కుమార్, మరియు వివిధ జిల్లా ఉద్యోగులు పాల్గొని నయవంచన దినం బ్లాక్ డేను జయప్రదం చేశారు.