బాబు జగజ్జీవన్ రామ్ బడుగు బలహీన వర్గాల ప్రజలకు ఎనలేని సేవలు అందించారు…

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
స్వాతంత్ర సమరయోధుడు, సంఘసంస్కర్త, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి స్వర్గీయ బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకల సందర్భంగా ఆయనను స్మరించుకోవడం మన కర్తవ్యమని జిల్లా కలెక్టర్ డాక్టర్ కే.మాధవీలత అన్నారు. మంగళవారం స్థానిక జాంపేటలో గల చర్చిపేట నందు భారత దేశ మాజీ ఉపప్రదాని బాబు జగ్జీవన్ రామ్ 115 వ జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి డాక్టర్ మాధవి లత.. స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులుతో కలిసి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మీడియా తో మాట్లాడుతూ సామాజిక న్యాయం, విపత్తుల సమయంలో వాటిని ఎలా అధిగమించాలనే లక్ష్యంతో బాబు జగజ్జీవన్ రామ్ బడుగు బలహీన వర్గాల ప్రజలకు ఎనలేని సేవలు అందించారన్నారు. నాలుగు దశాబ్దాల పాటు మంచి పార్లమెంటియన్ గా వివిధ హోదాల్లో అత్యుత్తమ సేవలు అందించారని కలెక్టర్ అన్నారు. వారు చేసిన మంచి పనులను భావితరాలకు అందించే బాధ్యత మనపై ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో జేసి సిహెచ్. శ్రీధర్, ఆర్డీవో ఎస్ మల్లిబాబు, రూడా చైర్మన్ మేడపాటి షర్మిలారెడ్డి, మాజీ శాసనసభ్యులు రౌతు సూర్యప్రకాశరావు, సాంఘిక సంక్షేమ శాఖ అధికారులు పి ఎన్ వి సత్యనారాయణ, పి వి డి ప్రసాద్, స్థానిక నాయకులు కాటం రజినీకాంత్, ఎం నాగేశ్వరరావు ప్రియాంక తదితరులు పాల్గొన్నారు

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రజలందరికీ సురక్షితమైన, స్వచ్ఛమైన తాగు నీరందించేలా చర్యలు

-నీటి సరఫరాలో నాణ్యతా లోపాలు లేకుండా నిరంతర పర్యవేక్షణ -⁠ఆధునీకరించి నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచి నీటి పథకాన్ని ప్రారంభించిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *