-శానిటరీ అధికారులకు ఆదేశాలు – స్వప్నిల్ దినకర్ పుండ్కర్, ఐ.ఏ.ఎస్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
నగరపాలక సంస్థ నూతన కమీషనర్ గా భాద్యతలు స్వీకరించిన స్వప్నిల్ దినకర్ పుండ్కర్, ఐ.ఏ.ఎస్ బ్రహ్మణవీధీ నందలి పారిశుధ్య నిర్వహణకు సంబందించి ఆర్యవైశ్య కళ్యాణమండపం వద్దన గల చెత్త డంపర్ బీన్స్ ను పరిశీలించి విధులలో ఉన్న శానిటరీ ఇన్స్ పెక్టర్ బి.సురేంద్రనాద్ ను ఎంత మంది సిబ్బంది పని చేస్తున్నది తదితర వివరాలు అడిగితెలుసుకొన్నారు. ఈ సందర్భంలో డివిజన్ నందు 15 మైక్రో పాకెట్స్ లలో సిబ్బంది ద్వారా ఇంటింటి చెత్త సేకరణ చేస్తున్నమని, కొండ ప్రాంతాలు, విధుల నుండి పారిశుధ్య సిబ్బంది ద్వారా నివాసాల నుండి సేకరించిన చెత్తను డంపర్ బీన్స్ నుండి వాహనము ద్వారా డంపింగ్ యార్డ్ కు తరలించుట జరుగుతుందని వివరించారు. చెత్త సేకరణ సమయంలో తడి మరియు పొడి చెత్తలను వేరు వేరుగా సేకరిస్తున్నది లేనిది అడిగితెలుసుకొనిన సందర్భంలో, తడి మరియు పొడి చెత్తలను వేరు వేరుగా అందించు విధానముపై ప్రజలకు అవగాహన కల్పించే విధంగా బీన్స్ వద్ద రెండు రకముల బీన్స్ ఏర్పాటు చేసినట్లు వివరించారు. అదే ప్రాంతములో డ్రెయిన్ నందు మురుగునీటి పారుదల విధానము పరిశీలిస్తూ, డ్రెయిన్ శుభ్రపరచు సమయంలో అడుగువరకు చెత్త మరియు సిల్ట్ ను పూర్తి స్థాయిలో తొలగించాలని మరియు డివిజన్ పరిసరాలు, లోడర్ పాయింట్స్ అన్నియు ఎల్లవేళలా పరిశుభ్రంగా ఉంచాలని ఆదేశించారు.