స్థానిక ప్రజల సమస్యల పరిష్కారానికి చర్యలు

-13వ డివిజనులో ఆకస్మిక తనిఖి ప్రజల సమస్యల పరిశీలన
-నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి 13వ డివిజన్ పరిధిలోని చిన్నవంతెన సెంటర్, తోట వారి వీధి, జె.డి.నగర్, లక్ష్మీపతి నగర్, మరియు RTC కాలనీ నందు పర్యటించి స్థానికంగా ప్రజలు ఎదుర్కోను ఇబ్బందులను క్షేత్ర స్థాయిలో పరిశీలించి అధికారులను వివరాలు అడిగితెలుసుకొని పలు సూచనలు చేసారు. ముందుగా శానిటరీ డివిజన్ కార్యాలయాన్ని ఆకస్మిక తనిఖీ చేసి అక్కడ విధి నిర్వహణలో ఉన్న పారిశుధ్య కార్మికుల యొక్క హాజరు పట్టికను మరియు FRS మస్తరు పరిశీలించారు.

డివిజన్ పరిధిలోని చిన్నవంతెన సెంటర్ వద్ద గల రజక కమ్యూనిటీ హాల్ నకు ఎలక్ట్రిసిటీ సప్లై లేకపోవడం గమనించి, స్పందించి కమ్యూనిటీ హాల్ కు కరెంటు సప్లై ఏర్పాటు చేయుటకు చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు. జె. డి. నగర్ 1 మరియు 2 క్రాస్ రోడ్డు, లక్ష్మీపతి నగర్ లలో రోడ్డులు పూర్తిగా పాడై భీటులవారీగా గుంతలతో వాహనముల మరియు ప్రజల రాకపోకలకు తీవ్ర ఇబ్బందులకు గురి అవుతున్నట్లుగా స్థానికులు మేయర్ దృష్టికి తీసుకురాగా రోడ్ మరమ్మతులు చేయుటకు చర్యలు చేపట్టాలని అధికారులకు ఆదేశించారు.

మదర్ థెరిసా పార్కును సందర్శించి అక్కడ గల సౌకర్యాలు పరిశీలించి పార్క్ నందు పాత్ వే మరియు పిల్లలు ఆడుకొను ప్రదేశములో ఇసుక ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. పార్క్ నందు టాయిలెట్, ప్రహరీ గోడ నిర్మాణం మరియు ప్రజలకు అవసరమైన అన్ని మౌలిక సదుపాయాలను సత్వరమే ఏర్పాటు చేయాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. పటమట న్యూ RTC కాలనీ పోలవరపు వారి వీధిలో LP.No 50/81 వద్ద ఖాళీగా నిరూపయోగంగా ఉన్న నగరపాలక సంస్థ స్థలములో ప్రజలకు వినియోగాపడే విధంగా భవన నిర్మాణము చేపట్టుటకు ప్రణాళికలను తాయారు చేయాలని సూచించగా, సదరు భవనము నందు 56,57 సచివాలయాల ఏర్పాటు చేయవలసినదిగా అక్కడ వున్న స్థానికులు కోరిన దానిపై సదరు విషయము అలోచించి కమీషనర్ గారితో చర్చించి తదుపరి నిర్ణయం తీసుంటామని స్థానికులకు వివరించారు.

పర్యటనలో స్థానిక కార్పొరేటర్ ముమ్మనేని వెంకట ప్రసాద్, హెల్త్ ఆఫీసర్ డా.బి.శ్రీదేవి, శానిటరీ ఇన్స్పెక్టర్ మరియు స్థానికులు తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

సత్యసాయి జిల్లాలో జరిగిన ప్రమాదంపై మంత్రి అచ్చెన్నాయుడు విచారం

-గొర్రెల కాపరి ఓబులపతికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించిన మంత్రి అచ్చెన్నాయుడు  -రహదారి ప్రమాదంలో గొర్రెల కాపరి ఓబులపతికి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *