-విధులలో అలసత్వం వహించకుండా భాద్యతగా నిర్వర్తంచాలి –
-కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, ఐ.ఏ.ఎస్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
సింగ్ నగర్ ప్రాంతములోని పలు విధులు మరియు ఎక్సెల్ ప్లాంట్ నందలి ట్రాన్స్ ఫర్ స్టేషన్ యొక్క నిర్వహణ విధానమును నగరపాలక సంస్థ కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, ఐ.ఏ.ఎస్ అధికారులతో కలసి పరిశీలించి వివరాలు అడిగితెలుసుకొని పలు ఆదేశాలు ఇచ్చారు. ముందుగా సింగ్ నగర్ ప్రాంతములోని లూనా సెంటర్, డాబా కోట్ల బజార్ మొదలగు ప్రాంతాలలో పారిశుధ్య నిర్వహణ తీరు మరియు డ్రెయిన్స్ నందు మురుగునీటి పారుదల విధానము పరిశీలించారు. విధులలో పారిశుధ్య కార్మికులు మరియు శానిటరీ సెక్రటరీల పని తీరును పరిశీలించి, విధులకు సకాలంలో హాజరు కావాలని ఆదేశిస్తూ, కార్మికల యొక్క హాజరు వివరాలు నోటీసు బోర్డు నందు ఉంచాలని అధికారులకు సూచించారు.
పారిశుధ్య నిర్వహణకు సంబందించి మైక్రో పాకెట్ ప్రకారం రూట్ మ్యాప్ తాయారు చేసి దాని ప్రకారం కార్మికులను కేటాయించి, శానిటరీ సెక్రెటరి ద్వారా పర్యవేక్షణ జరిగే విధంగా చూడాలని, నివాసాల నుండి చెత్త సేకరణకు సి అండ్ జీ వాహనములను వినియోగించాలని అన్నారు. సేకరణ సమయంలో తడి మరియు పొడి చెత్తలను వేరువేరుగా సేకరిస్తున్నది, సేకరించిన చెత్త నంతటిని వాహనముల ద్వారా ఏవిధంగా డంపింగ్ యార్డ్ నకు తరలిస్తున్నది పరిశీలించి అధికారులకు పలు ఆదేశాలు ఇచ్చారు. రోడ్ల పై ఎవరైనా చెత్త వేసిన వారిని గుర్తించి అట్టి వారికీ రోడ్ల పై చెత్త వేయకుండా అవగాహన కల్పించాలని సూచించారు. అదే విధంగా స్థానికులకు మంచినీటి సరఫరా తీరు, పారిశుధ్య నిర్వహణ తీరు, కాలువలను శుభ్రత తదితర అంశాలతో పాటుగా ప్రభుత్వం సంక్షేమ పథకములు యొక్క వివరాలు అడిగితెలుసుకోని, మీకు వార్డ్ వాలంటీర్ అందుబాటులో ఉంటున్నది లేనిది అడిగితెలుసుకొన్నారు.
తదుపరి సింగ్ నగర్ ఎక్సెల్ ప్లాంట్ నందలి ట్రాన్స్ ఫర్ స్టేషన్, చెత్త వేయింగ్ మిషన్ యొక్క పనితీరు పరిశీలించి వివరాలు అడిగితెలుసుకోనిన సందర్భంలో ఎక్సెల్ ప్లాంట్ ట్రాన్స్ ఫర్ స్టేషన్ నందలి చెత్తనంతటిని డంపింగ్ యార్డ్ కు తరలించుట పాటుగా మెయిన్ గోడపై స్వచ్చ్ సర్వేక్షణ్ పెయింటింగ్ వేసి పరిసరాలు అన్నియు శుభ్రంగా తీర్చిదిద్దాలని, ప్లాంట్ చుట్టూ ప్రహరి నిర్మాణమునకు చర్యలు తీసుకోవాలని మరియు ర్యాంప్ నుండి మెయిన్ రోడ్ వరకు అప్రోచ్ సి.సి రోడ్ వేయుటకు చర్యలు తీసుకోవాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. అదే విధంగా సి అండ్ జీ వేస్ట్ ప్లాంట్, ఆన్ సైట్ కంపౌస్ట్ ప్లాంట్ లను పరిశిలించి అవకాశం ఉన్న ప్రాంతాలలో గ్రీనరి పెంపొందించాలని సంబందిత అధికారులను ఆదేశించారు. 59వ డివిజన్ పరిధిలో త్రాగునీటి సమస్య, డ్రెయిన్ క్లీనింగ్, దోమలు వంటి పలు సమస్యలను స్థానికులు తెలిపిన దానిపై తక్షణమే పరిశీలించి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రోడ్ల పై అక్కడక్కడ ఉన్న బిల్డింగ్ డెబ్రిస్ తొలగించాలని ఆదేశించారు.
పర్యటనలో చీఫ్ ఇంజనీర్ యం.ప్రభాకర్, చీఫ్ మెడికల్ ఆఫీసర్ డా.జీ.గీత బాయి, ఎస్.ఇ పి.వి.కె భాస్కర్, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు కె. కోటేశ్వరరావు, వి.శ్రీనివాస్, హెల్త్ ఆఫీసర్ రామకోటేశ్వరరావు, శానిటరీ ఇన్స్ పెక్టర్లు మరియు స్థానికులు తదితరులు పాల్గొన్నారు.