-యాదవుల సామాజిక వర్గాన్నికి అన్యాయం చేసారు
-ముఖ్యమంత్రి పునరాలోచన చేసుకోవాలి
-రాష్ట్రంలో యాదవుల కార్పొరేషన్ చైర్మన్ ఉన్నాడా?
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
బీసీ లలో అత్యదిక ఓటు ఉన్న యాదవులకు మంత్రి పదవులు ఇవ్వడంలో ముఖ్యమంత్రి చిన్నచూపు చూసారని అఖిల భారత యాదవ మహాసంఘం అధ్యక్షులు ఉప్పలపాటి పేరయ్య యాదవ్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ మేరకు గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో విలేకరుల సమావేశం జరిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 26 జిల్లాలో యాదవులలో కానుమూరు నాగేశ్వరరావు కి ఒక మంత్రి పదవి ఇచ్చినందుకు ముఖ్యమంత్రికి అఖిల భారత యాదవ మహాసంఘం తరుపున కృతజ్ఞతలు తెలిపారు.26 జిల్లాలో బీసీలలో అత్యధిక ఓట్లు కలిగిన యాదవులకు ఒకే ఒక మంత్రి పదవి ఇవ్వటం మముల్ని కలిచివేసిందని, యాదవుల పట్ల ముఖ్యమంత్రికి ఉన్న చిత్తశుద్ధికి తాము చింతిస్తున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.బీసీ ల సామాజిక వర్గానికి ఎల్లవేళలా కృషి చేసిన జంగా కృష్ణమూర్తి ని కి గాని, అలాగే ముఖ్యమంత్రి తండ్రి హయాంలో ఆయన వెంట వుండే పార్థసారథి కి గాని మంత్రి పదవి ఇవ్వకపోవటం మమ్మల్ని తీవ్రంగా కలచివేసిందని అన్నారు.ఇప్పటికైనా ముఖ్యమంత్రి పునరాలోచన చేసుకుని పదవులు ఇవ్వాలని కోరారు.లేనిపక్షంలో యాదవులు అందరూ ఓటు బ్యాంకు ద్వారా బుద్ధి చెబుతామని హెచ్చరించారు.కార్యదర్శి రమేష్ యాదవ్ మాట్లాడుతూ నాయకులు ఏ పార్టీలో ఉన్నా యాదవులను విస్మరించరని కాని మొట్టమొదటిసారిగా యాదవులకి అన్యాయం జరిగిందని ధ్వజమెత్తారు.ఇంత జరుగుతున్నా యాదవుల కార్పొరేషన్ చైర్మన్ ఎక్కడ ఉన్నాడని? అసలు ఈ రాష్ట్రంలో ఉన్నాడా అని ఆయన ప్రశ్నించారు. ప్రతి జిల్లాల్లో యాదవులకు కళ్యాణమండపం కట్టాలని తమ ధ్యేయమని, అలాగే గొర్రెల కాపరులకు ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలని అధికార యంత్రాంగానికి విజ్ఞప్తి చేశారు. యాదవులు జరుగుతున్న అన్యాయాలకు, అక్రమాలకు ఈనెల 24న తుమ్మలపల్లి కళాక్షేత్రంలలో యాదవుల మహాసభను ఏర్పాటు చేస్తామని ఇదే రాబోయే ఎన్నికల్లో యాదవులకు మార్గదర్శకం అని నొక్కివక్కాణించారు.సమావేశంలో అఖిల భారత యాదవ మహాసంఘం నేతలు పాల్గొన్నారు.