విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
అజిత్ సింగ్ నగర్ వాంబే కాలనీ ఎఫ్ బ్లాక్ నందు మంచినీటి సరఫరా రంగు మారిందని, చాలినంత నీటి సరఫరా జరగడం లేదని అక్కడ ప్రజలు అందించిన ఫిర్యాదు పై సెంట్రల్ నియోజకవర్గ శాసన సభ్యులు మల్లాది విష్ణు, కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, ఐ.ఏ.ఎస్ క్షేత్ర స్థాయిలో సదరు సమస్యలను పరిశీలించి తక్షణమే మంచినీటి సరఫరా అభివృద్ధికి మంజూరు కాబడిన బోర్ వెల్స్ పనులు దానికి సంబందించి కరెంటు పనులు పూర్తి చేసి 15వ తేదిలోగా అందుబాటులోనికి తీసుకురావాలని ఆదేశించారు. సదరు ఆదేశాలకు అనుగుణంగా ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ వి.శ్రీనివాస్ పర్యవేక్షణలో ఇంజనీరింగ్ సిబ్బంది క్షేత్ర స్థాయిలో వాంబే కాలనీ ఎఫ్ బ్లాక్ నందు నివాసితులకు నీటి నాణ్యత, క్లోరిన్ శతం, రంగు పై స్థానికులకు అవగాహన కల్పిస్తూ, మంచినీటి సరఫరాలో ఇబ్బంది కలుగకుండా సిబ్బంది ప్రజలకు అందుబాటులో ఉంటూ అవసరమైన అన్ని చర్యలు తీసుకున్నట్లు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ వి.శ్రీనివాస్ వివరించారు.
Tags vijayawada
Check Also
నారావారిపల్లె గ్రామపంచాయతీ అభివృద్ధికి దిశా నిర్దేశం
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : చంద్రగిరి మండలం నారావారిపల్లి గ్రామపంచాయతీ స్వర్ణ నారావారిపల్లె విజన్ లో భాగంగా ఆదర్శవంతంగా …