విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
తూర్పు నియోజకవర్గ పరిధిలోని బాడవపేట,మాచవరం,బెంజ్ సర్కిల్ దగ్గర డాక్టర్. బి ఆర్ అంబేద్కర్ 131వ జయంతి సందర్భంగా వారి విగ్రహానికి మరియు చిత్ర పటానికి పూలమాలవేసి నివాళులు అర్పించిన తూర్పు నియోజకవర్గ ఇంచార్జ్ దేవినేని అవినాష్. ఈ సందర్భంగా అవినాష్ మాట్లాడుతూ భారతదేశ ఉన్నతికి భారత రాజ్యాంగం రూపొందించబడిందని ,దేశాన్ని ప్రజాస్వామ్య,లౌకిక, గణతంత్ర రాజ్యం గా నిర్మించుకోవడానికి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆధ్వర్యంలో భారత రాజ్యాంగ పీఠిక రూపకల్పన జరిగిందని అలాగే ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా ,రాజ్యాంగ స్ఫూర్తితో పరిపాలన కొనసాగిస్తున్నారని తెలిపారు. బడుగు, బలహీన, వెనుకబడిన, దళిత, పీడిత వర్గాలకు సాంఘిక, ఆర్ధిక, రాజకీయ న్యాయాన్ని కల్పించడానికి వైయస్ జగన్మోహన్ రెడ్డి కృషి చేస్తున్నారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో స్టాండింగ్ కమిటీ మెంబెర్ అంబెడ్కర్, కార్పొరేటర్లు నిర్మలాకుమారి, మాధురి వైస్సార్సీపీ నాయకులు తోకల శ్యాం, చిన్నబాబు, రాజ్ కమల్, శెటికం దుర్గ, అగస్టీన్, సుభాషిణి, చందా కిరణ్ తదితరులు పాల్గొన్నారు.
Tags vijayawada
Check Also
ప్రతి నెలా చేనేత ఎగ్జిబిషన్లు ఏర్పాటు
-మంత్రి సవిత వెల్లడి -నికె హ్యాండ్లూమ్ మార్కెటింగ్ ఎక్స్ పో 2024-25 ను ప్రారంభించిన మంత్రి -నేతన్నలకు 365 రోజులు …