Breaking News

శ్రీరాముని జీవితం అందరికీ ఆదర్శం: ఎమ్మెల్యే మల్లాది విష్ణు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
సకల గుణధాముడు శ్రీ రాముని జీవితం అందరికీ ఆదర్శప్రాయమని సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు మల్లాది విష్ణు అన్నారు. శ్రీరామనవమి ఉత్సవాలలో భాగంగా పైపులరోడ్డులోని శ్రీ సీతారామాంజనేయ స్వామి దేవస్థానం నందు గురువారం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ అలంపూర్ విజయలక్ష్మీతో కలిసి ఎమ్మెల్యే పాల్గొని భక్తులను అన్నప్రసాద వితరణ చేశారు. తొలుత దేవస్థానంలోని ఉత్సవ మూర్తులను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మల్లాది విష్ణు మాట్లాడుతూ.. జానకి సమేత శ్రీరామచంద్రుని సుగుణాలను కొనియాడారు. ప్రజాసంక్షేమమే ధ్యేయంగా, జనరంజక పాలన అందించిన ధర్మ పరిపాలకుడని కీర్తించారు. శ్రీరాముని కాలంలో ధర్మం నాలుగు పాదాలా నడిచిందని.. ఆయన పాలన దక్షత నేటితరానికి స్ఫూర్తిదాయకమని మల్లాది విష్ణు అన్నారు. ఎన్ని యుగాలు గడిచినా తండ్రి చేతల్లో, గురువు బాటల్లో నడిచిన శ్రీ సీతారామచంద్రమూర్తి తరతరాలకు ఆదర్శప్రాయమన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు అలంపూర్ విజయ్, అఫ్రోజ్, నేరెళ్ల శివ, రాజశేఖర్ రెడ్డి, మీసాల సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *