పూల వలన మనకు అనేక ఆరోగ్య ఫలితాలు వస్తాయి…


విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
పూల వలన మనకు అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని మానసిక పరిపక్వత పెంచుకోవటం కోసం, శారీరక సమస్యలను దూరం చేయడంలోనూ పూలు ప్రముఖ పాత్ర వహిస్తాయని అనిర్వేద ఫౌండేషన్ వ్యవస్థాపకులు డాక్టర్ కార్తీక్ గుప్త తెలిపారు. ఈ సందర్భంగా శనివారం అనిర్వేద ఫౌండేషన్ ఆధ్వర్యంలో గాంధీనగర్ ప్రెస్ క్లబ్ నందు ఆరోగ్య అవగాహన సదస్సు నిర్వహించారు.ఈ సదస్సులో డాక్టర్ కార్తీక్ గుప్త మాట్లాడుతూ పూలతో మనకు ఎటువంటి ప్రయోజనం జరుగుతుంది, పూలతో స్నానం చేయడం, ఇంట్లో వాడే పూలను అలంకరించడం వల్ల ఎటువంటి ఆరోగ్య ప్రయోజనం పొందుతామో వివరించడం జరిగిందన్నారు. భావోద్వేగాలు మార్చుకోవడం ద్వారా మన శరీరాన్ని ఎలా ధృడంగా మార్చుకోవచ్చు ఆరోగ్య సమస్యలను ఎలా సరిదిద్దుకోవచ్చు అనేది శాస్త్రీయ ఆధారాలతో వివరించడం జరిగిందన్నారు. అనుభవంతో చేసిన పరిశోధనల ఫలితాల గురించి తెలియజేశారన్నారు. ఈ కార్యక్రమంలో వెంకట్ తదితరులు పాల్గొన్నారు. అవసరం అయితే మరింత సమాచారం కొరకు వెంకట్ (9494229902) ను సంప్రదించగలరు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రతి నెలా చేనేత ఎగ్జిబిషన్లు ఏర్పాటు

-మంత్రి సవిత వెల్లడి -నికె హ్యాండ్లూమ్ మార్కెటింగ్ ఎక్స్ పో 2024-25 ను ప్రారంభించిన మంత్రి -నేతన్నలకు 365 రోజులు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *