విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
అమృత్ పథకంలో భాగంగా సత్యనారాయణపురంలో చేపట్టిన అండర్ గ్రౌండ్ డ్రైనేజీ(యు.జి.డి.) సంపు నిర్మాణ పనులను శనివారం ఎమ్మెల్యే మల్లాది విష్ణు పర్యవేక్షించారు. పనుల పురోగతి వివరాలను అధికారులతో మాట్లాడి తెలుసుకున్నారు. వచ్చే నెల 15 కల్లా ఎట్టిపరిస్థితుల్లోనూ పనులు పూర్తిచేయవలసిందిగా కాంట్రాక్టర్ ను ఆదేశించారు. దీని ద్వారా డివిజన్లో డ్రెనేజీ సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని మల్లాది విష్ణు పేర్కొన్నారు. ఎమ్మెల్యే వెంట స్థానిక కార్పొరేటర్ శర్వాణీ మూర్తి, ఈఈ శ్రీనివాస్, డీఈ గురునాథం, వీఎంసీ అధికారులు, సిబ్బంది ఉన్నారు.
Prajavartha Online Telugu News