విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
అమరావతి వర్కింగ్ జర్నలిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జర్నలిస్టు సోదరులకు ఇఫ్తార్ విందు కార్యక్రమం ఐఎంఏ హాలులో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు హాజరయ్యారు. ఈ సందర్భంగా మల్లాది విష్ణు మాట్లాడుతూ అమరావతి వర్కింగ్ జర్నలిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ చేపట్టిన ఇఫ్తార్ విందు జర్నలిస్టు మిత్రులు కులమతాలకు అతీతంగా ఏర్పాటు చేసిందని, అసోసియేషన్ కు ప్రభుత్వ పరంగా ఎటువంటి సహాయ సహకారాలు కావాలన్నా అందిస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఏపీజే ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు చెవుల కృష్ణ ఆంజనేయులు, మత పెద్దలు అబ్దుల్ సమద్, మౌలాలి ఇతర జర్నలిస్టు మిత్రులు పాల్గొన్నారు.
Tags vijayawada
Check Also
ఓపెన్ ఫోరం ద్వారా టౌన్ ప్లానింగ్ సమస్యల పరిష్కరణ
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఆదేశాల మేరకు శుక్రవారం నాడు పట్టణ …