Breaking News

లబ్ధిదారులకు అవగాహన కల్పించాలి…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
సంక్షేమ పథకాలకు ఆధార్‌ తప్పనిసరి కావడంతో అనుసంధానంలో ఎదురవుతున్న ఇబ్బందులపై లబ్ధిదారులకు అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్‌ యస్‌ డిల్లీరావు అధికారులను ఆదేశించారు. నగరంలోని కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో సోమవారం ఆధార్‌ కార్డులోని మార్పులు, చేర్పులు, సవరణలు తదితర అంశాలపై జిల్లా కలెక్టర్‌ డిల్లీరావు అధికారులకు, కార్వె కన్సల్‌టెంట్‌ ప్రతినిది ద్వారా అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలకు లబ్ధిదారుల ఆధార్‌ అనుసంధానం తప్పనిసరి కావడంతో ఆయా శాఖల అధికారులకు ఎదురవుతున్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని సులువుగా ఆ సమస్యలను పరిష్కరించుకునే వెసులుబాటు అందుబాటులో ఉందన్నారు. ముఖ్యంగా రెషన్‌, పెన్షన్‌, నగదు బదిలీ తదితర ప్రజా అవసరాలకు సంబంధించి ఆధార్‌లో పేరు తప్పుగా నమోదు కావడం, పుట్టిన తేదీ, మొబైల్‌ నెంబర్‌, చిరునామా, జండర్‌ సరిచేసుకునే అవకాశం వుందన్నారు. వీటికి సంబంధించి ఫ్రూప్‌ తప్పని సరిగా వుండాలన్నారు. పుట్టిన తేది మార్పుకు ఎస్‌ఎస్‌సి సర్టిఫికేట్‌, పాన్‌ కార్డు, బర్త్‌ సర్టిఫికేట్‌, పాస్‌ పోర్టు తదితర వాటితోపాటు గేజిటెడ్‌ ఆఫీసర్‌ సంతకం చేసిన లేటర్‌ ప్యాడ్‌ పై ఇచ్చే సర్టిఫికేట్‌ అవసరం వుంటుందన్నారు. వీటికి సమీపంలోని ఆధార్‌ నమోదు కేంద్రాలకు వెళ్లవలసి వుంటుందన్నారు. పుట్టిన తేదిని ఒకసారి మాత్రమే, పేరు మార్పుకు రెండు సార్లు మాత్రమే మార్చుకోవడానికి అవకాశం వుంటుందన్నారు. చిరునామ మార్పుకు అడ్రస్‌ ఫ్రూప్‌ తప్పని సరి అన్నారు. చిన్నారుల ఆధార్‌కు 5 సంవత్సరాలు తరువాత, 15 నుండి 17 సంవత్సరాల మధ్య కాలంలో బయోమెట్రిక్‌, ఫింగర్‌ ప్రింట్‌ అప్‌డేట్‌ తప్పనిసరిగా చేయించాలని కలెక్టర్‌ అన్నారు. దీనికి ఎటువంటి రుసుము చెల్లించవల్సిన అవసరం లేదన్నారు. కొత్తగా ఆధార్‌ నమోదు చేయించుకునేవారు సంబంధిత డాక్యుమెంట్స్‌తో తప్పనిసరిగా ఆధార్‌ నమోదు కేంద్రానికి వెళ్లవలసి వుంటుందని కలెక్టర్‌ అన్నారు. ఈ కార్యక్రమంలో జాయింట్‌ కలెక్టర్‌ ఎస్‌ నుపూర్‌ అజయ్‌, డిఆర్‌వో కె.మోహన్‌కుమార్‌, జడ్పిసిఇవో సూర్యప్రకాష్‌, కార్వె కన్సల్‌టెంట్‌ ప్రతినిది హరికృష్ణ ఉన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

“ఈ డిస్ట్రిక్ట్ మేనేజర్ ” దరఖాస్తులు స్వీకరణ

-దరఖాస్తు చేసుకున్న వారి జాబితా వెబ్ సైట్ లో అప్లోడ్ చెయ్యడం జరిగింది -ఈనెల 16 వ తేదీ సా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *