Breaking News

ఈనెల రేషన్‌ సరుకుల పంపిణీ నూరు శాతం లబ్దిదారులకు అందించాలి…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
కార్డుదారులకు ఈనెల రేషన్‌ సరుకుల పంపిణీ నూరు శాతం లబ్దిదారులకు అందించాలని జాయింట్‌ కలెక్టర్‌ ఎస్‌ నుపూర్‌ అజయ్‌ కుమార్‌ పౌర సరఫరాల శాఖ అధికారులను ఆదేశించినట్లు ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలో నేటి నుండి ప్రారంభించిన రేషన్‌పంపిణీ త్వరితగతిన కార్డు దారులకు అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. నూతన ఎన్‌టిఆర్‌ జిల్లాలో ఉన్న 958 రేషన్‌ దుకాణాలకు ఎఫ్‌సిఐ గోడౌన్‌ నుండి రవాణా చేయడం జరిగిందని ఆమె అన్నారు. జిల్లాలోని 5,86,301 బియ్యం కార్డుదారులకు 374 మొబైల్‌ డిస్పెంన్సింగ్‌ వాహనముల ద్వారా నేటి నుండి ప్రారంభమైన రేషన్‌ను ప్రాణాళిక బద్దంగా కార్డుదారుని ఇంటి వద్దకే అందించాలని జాయింట్‌ కలెక్టర్‌ ఆదేశించారు. మొబైల్‌ డిస్పెంన్సింగ్‌ వాహనాల ద్వారా లబ్దిదారులకు రేషన్‌ సరుకులు కార్డులోని సభ్యులు ఒక్కొక్కరికి 5 కిలో చొప్పున కిలో 1 రూపాయకి బియ్యం, అంత్యోదయ అన్న యోజన కార్డు దారులకు కార్డు ఒకింటికి కిలో 1 రూపాయకి 35 కేజి బియ్యం, అన్నపూర్ణ కార్డుదారులకు కార్డు ఒకింటికి 10 కేజిల బియ్యం చొప్పున ఉచితంగా పంపిణీ చేయాలని, పంచదార ఏఏవై కార్డు దారులకు కిలో రూ 13.50పైసలు చొప్పున 1 కెజీ, మిగిలిన కార్డు దారులకు పంచదార అర కేజి 17 రూపాయలు పంపిణీ చేయాలన్నారు. కందిపప్పు అన్ని కార్డు దారులకు రూ.67 చొప్పున 1 కేజి పంపిణీ చేయాలన్నారు. ఇతర రాష్ట్రాలకు చెందిన కార్డు దారులు మన జిల్లాలో నివసిస్తుంటే వారి అర్హత మేరకు సమీపంలోని డీలర్‌ ఫాపు నందు ఐయంపిడిఎస్‌ ద్వారా పంపిణీ చేయాలన్నారు. ఈ పంపిణీలో అలసత్వం వహించినా, అవకతవకలకు పాల్పడినా కఠిన చర్యలు తీసుకుంటామని, ప్రతీ కార్డుదారుడు తమకు పంపిణీ చేసిన నిత్యావసర సరుకులు తమ సొంత కుటుంబానికి వినియోగించుకోవాలని జాయింట్‌ కలెక్టర్‌ నుపూర్‌ అజయ్‌ ఆ ప్రకటనలో తెలిపారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

“ఈ డిస్ట్రిక్ట్ మేనేజర్ ” దరఖాస్తులు స్వీకరణ

-దరఖాస్తు చేసుకున్న వారి జాబితా వెబ్ సైట్ లో అప్లోడ్ చెయ్యడం జరిగింది -ఈనెల 16 వ తేదీ సా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *