విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
సుస్థిరాభివృద్ధి లక్ష్యాల సాధనలో జిల్లాను రాష్ట్రంలోనే అగ్రగామిగా నిలపాలని జిల్లా కలెక్టర్ ఎస్ డిల్లీరావు అన్నారు. జిల్లాలో సుస్థిరాభివృద్ధి ప్రగతిని సోమవారం నగరంలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా కలెక్టర్ డిల్లీరావు అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ నీతి అయోగ్ నివేదిక ప్రకారం సుస్థిరాభివృద్ధిలో దేశంలోనే మూడో స్థానంలో ఉన్న మన రాష్ట్రాన్ని మొదటి స్థానంలో తీసుకువచ్చేందుకు జిల్లాలోని ప్రతీ సూచిక దోహదం చేయాలన్నారు. నవరత్నాలు ద్వారా ప్రభుత్వం అమలు చేస్తున్న వైఎస్సార్ రైతు భరోసా, వైఎస్సార్ పెన్షన్ కానుక, వైఎస్సార్ ఆరోగ్యశ్రీ, జగనన్న అమ్మఒడి, జగనన్న విద్యా వసతి దీవెన, వైఎస్సార్ జలయజ్ఞనం తదితర పథకాలను జిల్లాలో అధికారులు సమర్థవంతంగా అమలు చేయడం ద్వారా సుస్థిరాభివృద్ధి లక్ష్మాలను చేరుకోవచ్చునని కలెక్టర్ అధికారులకు సూచించారు. పేదరికం, ఆకలి, ఆనారోగ్యం, లింగ అసమానతలు, నిరక్షరాస్యత, పర్యావరణ సమతౌల్యం, జీవవైధ్యం, తదితర అంశాలు సుస్థిరాభివృద్ధికి కీలకంగా ఉన్నాయని, వీటిని అధిగమిస్తే సుస్థిరాభివృద్ధి సాధ్యపడుతుందన్నారు. నెలవారి సాధించవల్సిన లక్ష్యాలను సంబంధిత శాఖలు పూర్తి చేయడం ద్వారా ఏడాదికి నిర్థేశించిన లక్ష్యాలను సకాలంలో చేరుకోవచ్చునన్నారు. సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు 17 ఉన్నాయని వాటి సాధనలో సంబంధిత శాఖలు ఏ స్థాయిలో ఉన్నమో తెలుసుకోనేందుకు ఏర్పాటు చేసిన సూచీల గురించి అవగాహన కలిగివుండాలన్నారు. ఆ లక్ష్యాలను చేరుకునేందుకు కృషి చేయాలని అధికారులను కలెక్టర్ కోరారు. సుస్థిరాభివృద్ధి సూచీలలో వెనుకబడిన అంశాలపై దృష్టి పెట్టి వాటిని మెరుగు పరచాలని కలెక్టర్ డిల్లీరావు అధికారులను కోరారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ ఎస్ నుపూర్ అజయ్, డిఆర్‌వో కె.మోహన్‌కుమార్, జడ్పిసిఇవో సూర్యప్రకాష్, సిపివో రత్నరూత్, వివిధ శాఖల జిల్లా అధికారులు తదితరులు ఉన్నారు.
Tags vijayawada
Check Also
ముఖ్యమంత్రి పర్యటనలో జిఎంసి నుండి చేపట్టాల్సిన పారిశుద్యం, ప్యాచ్ వర్క్ లను పూర్తి చేయాలి…
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : చేబ్రోలు హనుమయ్య కంపెనీ ప్రాంగణంలో శుక్రవారం జరిగే నారెడ్కో ప్రాపర్టీ షో ప్రారంభోత్సవ …