Breaking News

రాష్ట్రంలో 6 ఆశ్రమ పాఠశాలల్లో ఒక జూనియర్ కళాశాలల్లో అంధులు, బధిరుల ప్రవేశాలకు దరఖాస్తులు స్వీకరణ…

-2022-23 సంవత్సరానికి గాను రాష్ట్రంలో 462 ఖాళీలు అందుబాటులో ఉన్నాయి..
-వినికిడి లోపం, దృష్టి లోపం గల విద్యార్థుల నుండి ప్రవేశాల కొరకు దరఖాస్తులు కోరుతున్నాం..
-విభిన్న ప్రతిభావంతులు, హిజ్రాలు మరియు వయోవృద్ధుల
-సంక్షేమ శాఖ సంచాలకులు బి. రవి ప్రకాష్ రెడ్డి

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రంలో అంధుల ఆశ్రమ పాఠశాలలు, బాధిరుల ఆశ్రమ పాఠశాల, జూనియర్ కళాశాలల్లో ప్రవేశాలకు గాను అర్హత గలవారి నుండి దరఖాస్తులు కోరుతున్నామని రాష్ట్రంలో విభిన్న ప్రతిభావంతులు, హిజ్రాలు మరియు వయోవృద్ధుల సంక్షేమ శాఖ సంచాలకులు బి. రవి ప్రకాష్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్రంలో 3 ప్రాంతాలలో అంధుల ఆశ్రమ పాఠశాలలు, 3 ప్రాంతాలలో బధిరుల ఆశ్రమ పాఠశాలలు తో పాటు బధిరుల ఆశ్రమ జూనియర్ కళాశాల నిర్వహింపబడుతున్నాయని వాటిలో మొత్తం 462 ఖాళీలు ఉన్నాయని అయన అన్నారు. 2022-23 సంవత్సరానికి గాను ప్రవేశాల కొరకు అర్హత గలవారినుండి దరఖాస్తులు కోరుతున్నామని సంబంధిత పాఠశాలలో దరఖాస్తులు స్వీకరించబడతాయని అయన తెలిపారు. దరఖాస్తు చేయడానికి విద్యార్థి వయస్సు 5 సంవత్సరాలు పైబడి ఉండాలని, తప్పనిసరిగా ఆధార్ కార్డు, సదరం సర్టిఫికెట్, పాస్ పోర్ట్ సైజు ఫోటోలు 3 జత చేసి పంపాలని అయన అన్నారు. దృష్టి లోపం, వినికిడి లోపం అయిన విద్యార్థులు తప్పనిసరిగా ఈ అవకాశాన్ని సద్వినియోగ పరుచుకోవాలని ఆసక్తి గలవారు అర్హత గల విద్యార్థులు తెలియజేసిన ఫోన్ నెంబర్ లను సంప్రదించ వచ్చునని అన్నారు.
అందుల ఆశ్రమ పాఠశాల విజయనగరం లో 43 ఖాళీలు ఉన్నాయని, 1 తరగతి నుండి 8వ తరగతి వరకు బాలబాలికలకు ప్రవేశం గలదని సంప్రదించవల్సిన ఫోన్ నెంబర్ లు 8317548039, 9440359775 లలో సంప్రదించాలన్నారు. అందుల ఆశ్రమ పాఠశాల విశాఖపట్నం లో 54 ఖాళీలు ఉన్నాయని, 1 నుండి 10 వ తరగతి వరకు బాలికలకు మాత్రమే ప్రవేశం గలదని సంపారాడించవల్సిన ఫోన్ నెంబర్ లు 9494914959 మరియు 9014456753. అంధుల ఆశ్రమ పాఠశాల హిందూపురం లో 106 ఖాళీలు ఉన్నాయని 1 నుండి 10వ తరగతి వరకు బాల బాలికలకు ప్రవేశము గలదని సంప్రదించవల్సిన ఫోన్ నెంబర్ లు 7702227917 మరియు 7780524716. బదిరుల ఆశ్రమ పాఠశాల విజయనగరం లో 20 ఖాళీలు ఉన్నాయని 1 నుండి 8 తరతుల్లో బాల బాలికలకు ప్రవేశం గలదని సంప్రదించవల్సిని ఫోన్ నెంబర్ లు 9000013640, మరియు 9963809120. బదిరుల ఆశ్రమ పాఠశాల బాపట్ల నందు 78 ఖాళీలు ఉన్నవని 1 నుండి 10వ తరగతి వరకు బాలబాలికలకు ప్రవేశం గలదని సంప్రదించవల్సిన ఫోన్ నెంబర్ లు 9441943071, మరియు 9985837919. బధిరుల ఆశ్రమ పాఠశాల ఒంగోలు నందు 136 ఖాళీలు ఉన్నాయని 1 నుండి 10వ తరగతి వరకు బాలబాలికలకు ప్రవేశం గలదని సంప్రదించవల్సిన ఫోన్ నెంబర్ లు 9440437629 మరియు 7013268255. బధిరుల ఆశ్రమ జూనియర్ కళాశాల బాపట్ల ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో బాలురు, బాలికలకు 25 ఖాళీలు ఉన్నవని సంపారాడించవల్సిన ఫోన్ నెంబర్ లు 9441943071 మరియు 9985837919 లలో సంప్రదించవచ్చునని సంచాలకుల వారు తెలిపారు.
ఈ పాఠశాలల్లో బాలబాలికలకు ఉచిత విద్యతో పాటు పాఠ్య పుస్తకాలూ, నోట్ పుస్తకాలు, స్కూల్ యూనిఫామ్, ఉచిత భోజనం, అన్ని వేళలా వైద్యసౌకర్యం, హాస్టల్ వసతి సౌకర్యం, కంప్యూటర్ శిక్షణ కల్పించడం జరుగుతుందని అయన తెలిపారు. ప్రత్యేక ఆటస్థలం కలిగి ఈ పాఠశాలల్లో వివిధ ఆటలపోటీలు నిర్వహించబడతాయని విద్యార్థినీ విద్యార్థులకు బ్రెయిలీ లిపి, సాంకేతిక బాష నేర్పబడతాయని, ప్రత్యేక టీచర్ ల ద్వారా సువిశాలమైన పాఠశాల ప్రాంగణంలో ఆహ్లద కరమైన విద్యా భోధన ఇవ్వ బడునని దృష్టి లోపం, వినికిడి లోపం అయిన విద్యార్థులు 2022-23 సంవత్సరానికి గాను ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని రాష్ట్ర విభిన్న ప్రతిభావంతులు, హిజ్రాలు మరియు వయో వృద్ధుల సంక్షేమ శాఖ డైరెక్టర్ వి. రవి ప్రకాష్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రయాణ సమయంలో ప్రయాణికులకు అసౌకర్యం కల్పించిన వారి పై చట్ట రీత్యా కఠిన చర్యలు

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : సంక్రాంతి పండుగ సందర్భంగా గురువారం రాజమహేంద్రవరం జిల్లా రవాణా అధికారి వారి కార్యాలయంలో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *