విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
తెలుగు జాతి ఆత్మాభిమానాన్ని నలుదిశలా చాటిన మహనీయుడు ఎన్టీఆర్ అని ఆయనను నేటి తరం ఆదర్శప్రాయంగా తీసుకోవాలని జిల్లా కలెక్టరు ఎస్ . దిల్లిరావు అన్నారు. మాజీ ముఖ్యమంత్రి కీర్తిశేషులు నందమూరి తాకరామారావు శత జయంతి సందర్భంగా కలెక్టర్ తన కార్యలయం లో జాయింట్ కలెక్టరు నూపూర్ అజయ్ తో కలసి యన్టీఅర్ చిత్ర పటానికి పూలమాల వేసి నివాళలర్పించారు. వెండి తెరపై నవరసాలు పండించిన మహానటుడు, అశేష అభిమానుల హృదయాలలో చిరస్థాయిగా ఎన్టీఆర్ నిలిచిపోతారని అన్నారు. ఎన్టీఆర్ కృషి, దీక్ష, పట్టుదలకు ప్రతీకగా, నియమ నిష్టలకు, క్రమశిక్షణకు మారుపేరు అని ఆయన పేరుతో ఏర్పడిన నూతన జిల్లాకు తొలి కలెక్టరు గా భాద్యతలు నిర్వహించడం అదృష్టంగా భావిస్తున్నానని కలెక్టరు ఎస్.డిల్లీ రావు తెలిపారు.
Prajavartha Online Telugu News