– కలెక్టర్ మాధవీలత
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
స్కూల్స్ ప్రారంభం అయ్యేనాటికి వసతి గృహాలలో పూర్తిస్థాయి మౌలిక వసతులను , సదుపాయాలను సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ కె మాధవి లత స్పష్టం చేశారు. శనివారం కలెక్టర్ చాంబర్లో సంక్షేమ వసతి గృహాల పై అధికారులతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు. రంగా ఈ సందర్భంగా కలెక్టర్ మాధవీలత మాట్లాడుతూ వేసవి సెలవులు అనంతరం విద్యార్థినీ విద్యార్థులు వసతి గృహాలకు వచ్చే సమయానికి శుద్ధమైన తాగునీరు పరిశుభ్రమైన వాతావరణం బాలికలకు మరియు బాలురకు విడివిడిగా బాత్రూములు, నీటి వసతి, దోమతెరలు, పిల్లలకు కావలసిన కాస్మెటిక్ సదుపాయాలను సిద్ధం చేయాలన్నారు. హాస్టల్స్ రూములను చక్కగా తీర్చిదిద్దాలన్నారు. ఇందుకు కార్పొరేట్ సామాజిక బాధ్యత (సి ఎస్ ఆర్) గా ఓ ఎన్ జీ సి, గేయిల్, ప్రముఖ వ్యాపార సంస్థలు తదితర సంస్థల సహకారాన్ని తీసుకోవాలన్నారు. పాఠశాలలు ప్రారంభించే సమయానికి ముఖ్యంగా ఏడు ప్రధాన అంశాల లక్ష్యంగా హాస్టల్ వసతిగృహాల నిర్వహణ తీరును మెరుగుపరచాలని కలెక్టర్ మాధవి లత స్పష్టం చేశారు. త్రాగునీరు ,బాత్రూంలు, దోమతెరలు, అదనపు తరగతి గదులు, లైటింగ్, ఫ్యాన్లు, వసతి గృహాల ప్రాంగణంలో చక్కని వాతావరణం వంటి వాటికి ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. సాంఘిక సంక్షేమ , బిసి సంక్షేమ , ట్రైబల్ వెల్ఫేర్ హాస్టల్సు వివరాలు, అక్కడ ఉన్న వసతి వివరాలు, నాడు నేడు ద్వారా చేపట్టిన పనులు వివరాలు, ప్రగతి తీరుపై కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. అదనపు తరగతి గదుల నిర్మాణం కోసం ఇంజనీరింగ్ అధికారులతో అంచనాలు వేసి పనులు వేగవంతం చేయాలని ఆదేశించారు. ఈ సమావేశంలో సాంఘిక సంక్షమశాఖ అధికారి పి ఎన్ వి సత్యనారాయణ, బిసి సంక్షేమ అధికారి సత్య రమేష్, జిల్లా బిసి అధికారి ఎస్.రాణికుమారి, ట్రైబల్ వెల్ఫేర్ అధికారి కె. నాగ జ్యోతి, . తదితరులు పాల్గొన్నారు.