విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్ర వ్యాప్త మున్సిపల్ ఔట్ సోర్సింగ్ కార్మికులు సమస్యల పరిష్కార విషయం గురించి మంగళవారం గాంధీనగర్ లోని ప్రెస్ క్లబ్ లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మునిసిపల్ ఇంజనీరింగ్ -టౌన్ ప్లానింగ్ & శానిటీషన్ వర్కర్స్ ట్రేడ్ యూనియన్ అధ్యక్షులు ఈదుల మూడి. మధుబాబు అధ్యక్షతన విలేకరుల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఈదుల మూడి. మధు బాబు మాట్లాడుతూ 25 సంవత్సరములుగా మునిసిపల్ రంగము లో పని చేయుచున్న కార్మికులందరికి జీఓ నెం : 30 తేది. 18.01.2019న జారీ చేసిన జీ.ఓ ను అమలు చేయాలని, లేక సమాన పనికి సమాన వేతనం యివ్వాలని, మరియు జీఓ నెం : 25 ప్రకారము ప్రమాద బీమా రు 5.0 లక్షలు, సహజ మరణా నికి రు: 2.00 లక్షలు మంజూరు చేయాలని ఔట్ సోర్సింగ్ కార్మికులకు అమ్మ ఒడి, జగనన్న విద్యాదీవెన, మిగిలిన అన్ని సంక్షేమ పథకాలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఔట్ సోర్సింగ్ కార్పొరేషన్ నుండి పి ఎఫ్, ఇ ఎస్ ఐ సక్రమంగా అమలు చేయాలని, 60 సం. నిండిన కార్మికులను ఔట్ సోర్సింగ్ కార్మికులను ఔట్ సోర్సింగ్ కార్పొరేషన్ నుండి తొలగించడం జరిగింది. కానీ వారిని తీసి వేసే ముందు వారి జీతాలలో మినహాయించాల్సిన పి ఎఫ్, ఇ ఎస్ ఐ.సొమ్ము ను వారి జీతాలలో నుండి మినహాయించకుండా జీతం మొత్తం ను వారి ఖాతాలలో జమచేయడం వలన వారి పి ఎఫ్ ఖాతాలలో ఇదివరకు ఉన్న సొమ్మును విత్ డ్రా చేసుకునే వీలులేక ఇటు జీతం లేక ఇటు పి ఎఫ్ సొమ్ము రాక దుర్భరమైన జీవితం గడుపుతున్నారని ఈ సమస్యలన్నీ సి డి ఎం ఎ దృష్టికి తీసుకొని వెళ్తామని ఈ సమస్యలు పరిష్కరించని యెడల ఆందోళన కార్యక్రమాలు చేపడతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో యూనియన్ ప్రధాన కార్యదర్శి గంజి రామమూర్తి, కోశాధికారి కొండూరు బాబా ఫక్రుద్దీన్, జాయింట్ సెక్రటరీ ఈర్ల రాము, జరదొడ్డి రమేష్, శ్రీనివాసులు, కోటేశ్వరరావు, నాగిపోగు సుమన్ కార్మికులు పాల్గొన్నారు.
Tags vijayawada
Check Also
గ్రామ, వార్డు సచివాలయాల్లో రేషనలైజేషన్
-మూడు కేటగిరీలుగా సచివాలయాల విభజన -కనీసం 2500 మందికి ఒక గ్రామ, వార్డు సచివాలయం -మల్టీపర్పస్ ఫంక్షనరీస్, టెక్నికల్ ఫంక్షనరీలుగా …