-రాష్ట్ర హోం మంత్రి తానేటి వనిత
కొవ్వూరు, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రం లో వైద్య చేయించు కోలేక అనారోగ్యం బాధపడుతున్న నిరుపేద ప్రజలకు వై.ఎస్. ఆరోగ్యశ్రీ ద్వారా మెరుగైన వైద్య సేవలు కోసం ఆర్థిక సహాయం అందిస్తున్నామని రాష్ట్ర హోం మంత్రి తానేటి వనిత అన్నారు. మంగళవారం కొవ్వూరు మంత్రి క్యాంప్ కార్యాలయం లో ముఖ్యమంత్రి సహాయ నిధి పధకం ద్వారా వచ్చిన 96 మంది లబ్ధిదారులకు వైద్యం చేయించుకొనే నిమిత్తం రూ 49 లక్ష ల 33 వేల 500 ల చెక్కులను మంత్రి లబ్ధిదారులకు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా మంత్రి తానేటి వనిత మాట్లాడుతూ, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆపదలో ఉన్న ప్రతి ఒక్కరికి చేదోడుగా ఉంటూ, ఆపదలో అన్నలా సంక్షేమ పథకాలతో అందిస్తూ, ఆపదలో ఆదుకోవడానికి ఎప్పుడు ముందు ఉంటారని తెలిపారు. కొవ్వూరు నియోజకవర్గ పరిధిలోని చాగల్లులో 20 మంది లబ్ధిదారులకు, కొవ్వూరు లో 50 మంది లబ్ధిదారులకు, తాళ్ళపూడిలో 13, వివిధ ప్రాంతాలకు చెందిన లబ్ధిదారులకు 5 మందికి సిఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు అందచేయడం జరిగిందన్నారు. పేద ప్రజలకు వైద్యం అందుబాటులో ఉండే విధంగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యులను, వైద్య పరికరాలు అందుబాటులో ఉంచి, మెరుగైన వైద్య సేవలు అందించడం జరుగుతొందన్నారు. కార్యక్రమంలో మునిసిపల్ ఛైర్పర్సన్, బావన రత్న కుమా రి, సీ. హెచ్. దుర్గా మల్లేశ్వర రావు, జి. శివ, పి. నగేష్, పి. సోమరాజు, స్థానిక ప్రజాప్రతిని ధులు, తదితరులు పాల్గొన్నా రు.
Prajavartha Online Telugu News