-అజాదికా అమృత్ మహోత్సవ్ వేళ ఘనంగా యోగా దినోత్సవం
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
మంగళవారం ఉదయం రాజమహేంద్రవరం జవహర్ లాల్ నెహ్రూ రోడ్ లోని ఫంక్షన్ హాల్ తూర్పు గోదావరి జిల్లా చేపట్టిన 8 వ అంతర్జాతీయ యోగా దినోత్సవం లో పాల్గొన్న జిల్లా కలెక్టర్ డా కే. మాధవీలత, పార్లమెంట్ సభ్యులు మార్గని భరత్ రామ్, రూడా చైర్ పర్సన్ ఏమ్. షర్మిలా రెడ్డి, మునిసిపల్ కమిషనర్ కె. దినేష్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.
పార్లమెంట్ సభ్యులు మార్గాని భరత్ రామ్ మాట్లాడుతూ, ప్రధాన మంత్రి ఆధ్వర్యంలో భారత దేశ సంస్కృతిని ప్రతిబింబించే విధంగా యోగా దినోత్సవం నేడు ప్రపంచ వ్యాప్తంగా జరుపుకుని, మనదేశానికి గుర్తింపు తీసుకుని రావడం జరిగిందన్నారు . మానవీయ విలువలు కాపాడాలనే సందేశంతో ఈ ఏడాది యోగ దినోత్సవం జరుపుకుటున్నాం అని పేర్కొన్నారు.
యువత ముఖ్యంగా ఆధునిక కాలంలో ఫిజికల్ ఫిట్నెస్ పై దృష్టి పెట్టాలని కోరారు. అందుకు యోగా ఒక అద్భుతమైన ప్రక్రియ అని తెలిపారు. ఆయుర్వేదం, యోగా, నేచురోపతి, యునాని, సిద్ధ హోమియోపతి విభాగాలు కలియకే ఆయుష్ అన్నారు. జిల్లాలో ఆయుష్ విభాగంను మరింతగా పటిష్టం చేయడానికి అవసరమైన చర్యలు తీసుకుంటామని ఆయన అన్నారు. పాలన వికేంద్రీకరణ లో భాగంగా పార్లమెంటు నియోజకవర్గాన్ని ఒక జిల్లాగా చేయడం జరిగిందన్నారు. ఇందువల్ల చిన్న చిన్న సమస్యలు కూడా పరిష్కరించడానికి ఏర్పడిందన్నారు. యోగా వలన వత్తిడిని తగ్గించే అవకాశం ఉందని ఆయన తెలిపారు.
జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, అందరి జీవితాల్లో వత్తిడి చిన్నతనం నుంచే మొదలు అవుతోందన్నారు. ప్రతి ఒక్కరూ యోగా యొక్క ప్రాముఖ్యత ను కలిగించారు. మీ ఆలోచనల ఆరోగ్య కారంగా ఉండాలంటే యోగా ఒక ఆయుధంగా ఉంటుంది. ఏదో ఒక రోజు కాకుండా మీ జీవితం లో యోగా భాగం కావాలన్నారు. యోగాభ్యాసం లో ఎన్నో ఆసనాలు, ప్రాణాయామం, పిరమిడ్, రాజా యోగ వంటి ప్రక్రియలను ఈరోజు చూశా మన్నారు. కనీసం రోజులో 10 నుంచి 30 నిమిషాలు సాధన చేయాలన్నారు. మంచి ఆలోచన దృక్పథానికి ఇటువంటి ప్రక్రియలు ఉత్తమ ఫలితాలు ఇస్తాయని తెలిపారు. అందుకే ఈ ఏడాది “మానవత్వం కోసం యోగా” నినాదంతో అంతర్జాతీయ యోగా దినోత్సవం జరుపుకోవడం జరుగుతోందని తెలిపారు.
మునిసిపల్ కమిషనర్ దినేష్ కుమార్ మాట్లాడుతూ, మన దేశ ప్రధాని యోగా ను ప్రపంచానికి తెలియచేయడం ద్వారా మన భారతదేశ ప్రాముఖ్యతను ప్రపంచానికి చాటి చెప్పారన్నారు. మానసిక ఒత్తిడి ని ఎదుర్కునేందుకు యోగా ఒక ప్రధాన ఆయుధంగా ఉంటుందనడంలో అతిశయోక్తి లేదన్నారు. శారీరక దృఢత్వం తో మానసిక ఒత్తిడి తట్టుకునే విధంగా యోగా ఎంతో మేలు చేకూరుతుందని తెలిపారు. యోగా అభ్యాసం ద్వారా మంచి పౌరులుగా, దృఢ చిత్తం కలిగి మంచి పౌరులుగా మనకు మనం తీర్చి దిద్దుకో గలుగుతామన్నరు.
రూడా చైర్ పర్సన్ ఎం. షర్మిలా రెడ్డి మాట్లాడుతూ, యోగా సాధన ద్వారా వత్తిడి ని అధిగమించడం సాధ్యం అవుతుందన్నారు. మన శరీరం, మనస్సు ను నియంత్రించడం లో యోగా వలన ఎంతో మేలు చేకూరుతుందన్నారు. ఈ కార్యక్రమం నిర్వహించినందుకు షర్మిలా రెడ్డి ఆయుష్ శాఖకు, జిల్లా యంత్రాంగానికి కృతజ్ఞతలు తెలిపారు.
పలువురు వక్తలు మాట్లాడుతూ, జూన్ 21 క్యాలండర్ లో అత్యంత ఎక్కువ పగలు ఉండే రోజు, భౌగోళకంగా సూర్య గమనం తదితర ఎన్నో అంశాలను ప్రామాణికంగా తీసుకుని యోగా దినోత్సవం చెయ్యడం జరుగుతోంది. యోగా సాధనద్వారా ప్రతికూల ఆలోచన నుంచి బయట పడడం సాధ్యం అవుతుంది. తొలి అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని 2015 జూన్ 21 న నిర్వహించడం , 2014 న ఐక్య రాజ్య సమితి అంతర్జాతీయ యోగా దినోత్సవం నిర్వహించాలని నిర్ణయించారు.
జిల్లా ఆయుష్ శాఖ అధికారి డా. కె. విజయ కుమారి, డా. రామచంద్ర పరిజ్ ఆధ్వర్యంలో యోగా , ఏ. రాజేశ్వరరావు ద్వారా ప్రాణాయామం, కల్పన మూర్తి పిరమిడ్ ధ్యాన ప్రక్రియ పై , బ్రహ్మా కుమారిస్ రాజా యోగా, విజయ కుమారి యోగా ప్రతిజ్ఞ పైన అభ్యాసం చేయించారు.
డి ఈ ఓ ఎస్. అబ్రహం, నెహ్రూ యువ కేంద్రం కో ఆర్డినేటర్ అమృతేష్ , డిసిహెచ్ఎస్ డాక్టర్ సనత్ కుమారి, డిఎంహెచ్ఓ డాక్టర్ ఆర్.స్వర్ణ లత, ఫారెస్ట్ అకాడమీ ఆఫీసర్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News