బీసీల గూర్చి మాట్లాడే నైతిక అర్హత బోండా ఉమాకు లేదు

-బలహీన వర్గాల వెన్ను విరిచిన వ్యక్తి బోండా ఉమా
-తెలుగుదేశం హయాంలో బీసీలకు జరిగిన ఒక్క మేలు అయినా ఉందా..?
-బీసీలను రాజ్యాధికారం దిశగా తీసుకెళుతున్న ఘనత సీఎం వైఎస్‌ జగన్‌ది
-వైఎస్సార్ సీపీ నాయకులు ఉమ్మడి వెంకట్రావ్, యర్రగొర్ల శ్రీరాములు, ఇసరపు రాజారమేష్, అంగిరేకుల నాగేశ్వరరావు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
బీసీలకు సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం ఇచ్చినంత ప్రాధాన్యం గతంలో ఏ ప్రభుత్వం ఇవ్వలేదని వైఎస్సార్ సీపీ నాయకులు ఉమ్మడి వెంకట్రావ్, యర్రగొర్ల శ్రీరాములు, ఇసరపు రాజా రమేష్, అంగిరేకుల నాగేశ్వరరావు అన్నారు. రాష్ట్ర ప్రభుత్వంపై మాజీ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు చేసిన వ్యాఖ్యలను మంగళవారం వారు తీవ్రంగా ఖండించారు. సీఎం వైఎస్ జగన్‌ లా దేశంలో ఏ ముఖ్యమంత్రి బీసీలకు మేలు చేయలేదన్నారు. స్థానిక సంస్థల నుంచి రాజ్యస‌భ వ‌ర‌కు అన్నింటా బీసీల‌కు ముఖ్యమంత్రి వైఎస్ జ‌గ‌న్ పెద్దపీట వేశార‌ని చెప్పుకొచ్చారు. బలహీనవర్గాల హక్కుల కోసం రాజ్యసభలో పోరాడాలని మోపిదేవి వెంకటరమణ, పిల్లి సుభాష్ చంద్రబోస్‌ తో పాటు ఆర్.కృష్ణయ్యకు ఇటీవల అవకాశం కల్పించారని చెప్పారు. కొత్త కేబినెట్‌లోనూ 10 మంది బీసీలకు సీఎం వైఎస్ జగన్ మంత్రులుగా అవకాశం కల్పించారని గుర్తుచేశారు. చంద్రబాబు ఏనాడైనా బీసీలకు ఇన్ని మంత్రి పదవులు, రాజ్యసభ సీట్లు ఇచ్చారా..? అని ప్రశ్నించారు. టీడీపీలో బీసీలంటే యనమల రామకృష్ణుడు, అచ్చెన్నాయుడు, అయ్యన్నపాత్రుడు మాత్రమే అని వ్యాఖ్యానించారు. పార్లమెంట్‌లో బీసీ బిల్లు పెట్టాలని ఎన్నిసార్లు అడిగినా చంద్రబాబు స్పందించలేదని గుర్తుచేశారు. కానీ సీఎం వైఎస్ జగన్‌ పార్లమెంట్‌లో బీసీ బిల్లు పెట్టించారని.. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ఏ రాజకీయ పార్టీ కూడా పార్లమెంట్‌ లో బీసీ బిల్లు పెట్టలేదని వ్యాఖ్యానించారు, బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు కావాలని కోరలేదన్నారు. బీసీలంటే వెనుక‌బ‌డిన త‌రగ‌తులు కాదు.. వెన్నెముక కులాల‌ని దేశవ్యాప్తంగా చాటిన వ్యక్తి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని చెప్పుకొచ్చారు. బీసీలకు 111 కార్పొరేషన్‌ పదవులు ఇచ్చి సీఎం వైఎస్ జగన్‌ గౌరవించారని గుర్తు చేశారు. ఆయన స్ఫూర్తితో సెంట్రల్ నియోజకవర్గంలో 21 స్థానాలకు గానూ.. 12 స్థానాలలో కార్పొరేటర్లుగా బీసీలకు ఎమ్మెల్యే మల్లాది విష్ణు గారు అవకాశం కల్పించారని వ్యాఖ్యానించారు.

అయ్యన్న పాత్రుడు కబ్జాలను డైవర్ట్ చేసేందుకే టీడీపీ నానా యాగీ చేస్తోంద‌ని వైసీపీ నాయకులు మండిపడ్డారు. ప్రభుత్వ స్థలాన్ని కబ్జా చేసిన వ్యక్తిని కాపాడటం కోసం.. రాష్ట్రంలో బీసీలందరికీ ఏదో అన్యాయం జరిగిపోయినట్లు రాద్ధాంతం చేస్తున్నారన్నారు. బోండా ఉమా రాజకీయ జీవితంలో బీసీలకు ఏనాడైనా రాజకీయ ప్రాధాన్యతను కల్పించారా..? అని సూటిగా ప్రశ్నించారు. డిప్యూటీ మేయర్ పదవిని యాదవులకు ఇస్తే అడ్డం పడి నానా యాగీ చేసింది మీరు కాదా..? అని సూటిగా ప్రశ్నించారు. 30వ డివిజన్ లో బీసీ వర్గానికి చెందిన గోగుల రమణ పోటీ చేయడానికి ముందుకు వస్తే.. మీ సొంత మనుషులను పోటీ పెట్టి మరీ ఓడించింది మర్చిపోయారా..? అని గుర్తుచేశారు. 27వ డివిజన్ లో యాదవులకు ఏకంగా టిక్కెట్ రాకుండా అడ్డుపడింది వాస్తవం కాదా..? అని ప్రశ్నించారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి కి రోజురోజుకూ ప్రజాదరణ పెరిగిపోతుండటంతో చూసి ఓర్వలేక, ఏదోవిధంగా బురద చల్లాలనే దురుద్దేశాలతో టీడీపీ కుట్రలు చేస్తోందన్నారు. మరో రెండేళ్లలో 2024 ఎన్నికల నాటికి తెలుగుదేశం మరింత పాతాళంలోకి వెళ్లిపోవడం ఖాయమన్నారు. ఇకనైనా ఈ ప్రభుత్వంపైన మీ దుష్ట, నీచ రాజకీయాలను మానుకోవాలని.. లేనిపక్షాన నియోజకవర్గ ప్రజలంతా ఏకమై మిమ్ములను తరిమితరిమి కొడతారనే విషయాన్ని గుర్తుంచుకోవాలని హెచ్చరించారు. మరో 25 ఏళ్లు ఆంధ్రప్రదేశ్‌ కు ముఖ్యమంత్రిగా వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి ఉంటారని.. బీసీలంతా ఎప్పటికీ జగనన్నతోనే ఉంటారని స్పష్టం చేశారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రజలందరికీ సురక్షితమైన, స్వచ్ఛమైన తాగు నీరందించేలా చర్యలు

-నీటి సరఫరాలో నాణ్యతా లోపాలు లేకుండా నిరంతర పర్యవేక్షణ -⁠ఆధునీకరించి నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచి నీటి పథకాన్ని ప్రారంభించిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *