విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ పశ్చిమ నియోజకవర్గం కొత్తపేటలోని శ్రీ రుక్మిణీ సత్యభామ సమేత వేణుగోపాల స్వామి గుడి ఆవరణలో మంగళవారం రవి కృష్ణ మాతృమూర్తి కీl l శే l l గొలగాని లక్ష్మీ దుర్గాంబ జయంతి సందర్భంగా ప్రవాసాంధ్రులు గొలగాని రవి కృష్ణ ఆధ్వర్యంలో గొలగాని చారిటబుల్ ట్రస్ట్ ద్వారా వారి తల్లిదండ్రుల పేరు మీద పశ్చిమ నియోజకవర్గం లోని వెనకబడిన వర్గాలకు చెందిన పేద మహిళలకు జీవనోపాధి నిమిత్తం ఉచితంగా తోపుడు బండ్లు పంపిణీ చేశారు. అనంతరం పేదలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్య్రమానికి విచ్చేసినటువంటి ముఖ్య అతిథులు తెలుగుదేశం పార్టీ 52వ డివిజన్ కార్పొరేటర్ ఉమ్మడి చంటి మాట్లాడుతూ గొలగాని రవి కృష్ణ ఎక్కడో విదేశాల్లో ఉండి విజయవాడలోని అనేక సేవా కార్యక్రమాలు చేయడం చాలా ఆనందదాయకమని అన్నారు.
భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అడ్డూరి శ్రీరామ్ మాట్లాడుతూ గొలగాని రవి కృష్ణ తన తల్లి దండ్రుల పేరు మీద వారి తల్లి జయంతి సందర్భంగా పేదవారికి రెండు తోపుడు బళ్లను ఇవ్వటమే కాకుండా 150 మందికి అన్నదాన కార్యక్రమం కూడా నిర్వహించరన్నారు. రవికృష్ణ కరోనా కష్టకాలంలో కూడా ఎంతో సేవలందించరన్నారు. ప్రైవేటు స్కూలులో పనిచేసే ఉపాధ్యాయులకు, సినిమా థియేటర్లో పనిచేసే సినీ కార్మికులకు అలాగే శానిటరీ, పోలీస్ సిబ్బందికి ఎంతోమందికి నిత్యావసర సరుకులు తో పాటు కూరగాయలు బట్టలు పంపిణీ చేయడం చాలా ఆనందదాయకం అన్నారు. పల్లా దుర్గమ్మ సీపీఐ మాజీ కార్పొరేటర్ మాట్లాడుతూ రవి కృష్ణయ్య తన తన తల్లిదండ్రుల పేర్లను నిలబెట్టిన గొప్ప మనసున్న మనిషి అని అతను సేవా కార్యక్రమాలు చాలా చక్కగా నిర్వహిస్తున్నాడని అతనికి ఆ అమ్మవారి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలన్నారు. ఓబీసీ మోర్చా ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు శివకుమార్ పట్నాయక్ మాట్లాడుతూ నా చిన్ననాటి మిత్రుడు అయినటువంటి గొలగాని రవి కృష్ణ అనేక సేవా కార్యక్రమాలు కరోనాలోనే కాకుండా ఎంతో మందికి ఆర్థికంగా ఆరోగ్యపరమైన సమస్యలు ఉన్నవారికి ఆర్థిక సాయం అందించడంలో ముందున్న వ్యక్తి అన్నారు. ఈ కార్య్రమంలో ఎన్ టి అర్ జిల్లా టి డి పి ఆఫీసు కార్యదర్శి సారేపల్లి రాధా కృష్ణ, వంజారపు సూర్యారావు యాదవ కళ్యాణ మండపం అధ్యక్షులు, పొట్నూరి చక్రధర్, కోళ్ల రజిని, దుక్కా వేణు, మురిపాల దుర్గారావు యాదవ కళ్యాణ మండపం సెక్రెటరీ, కోలా ప్రసాద్ యాదవ కళ్యాణ మండపం ఉపాధ్యక్షులు, బూర కనకారావు యాదవ కళ్యాణ మండపం జాయింట్ సెక్రటరీ, నక్కాని రాము, తోట కోటి, ఒమ్మి సాయి, డోప్పా పవన్ , డోప్ప ప్రకాష్, పైలా ఆనంద్, బొట్ట నాగేంద్ర తదితరులు పాల్గొన్నారు.
Tags vijayawada
Check Also
ప్రతి నెలా చేనేత ఎగ్జిబిషన్లు ఏర్పాటు
-మంత్రి సవిత వెల్లడి -నికె హ్యాండ్లూమ్ మార్కెటింగ్ ఎక్స్ పో 2024-25 ను ప్రారంభించిన మంత్రి -నేతన్నలకు 365 రోజులు …