వర్షాన్ని సైతం లెక్కచేయకుండా ప్రజలవద్దకు వెళ్లి వారి సమస్యలు తెలుసుకున్న వెలంపల్లి…

-ప్రజా సమస్యలు తెలుసుకొని వాటి పరిష్కారానికే గడప గడప కార్యక్రమం – వెలంపల్లి
-ప్రభుత్వంలో వుండి ప్రజల దగ్గరకు వెళ్తుంటే చాలా సంతృప్తిగా ఉంది – వెలంపల్లి

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో 49వ డివిజన్ లోని 166వ సచివాలయం పరిధిలో 37వ రోజు మంగళవారం నాడు గడప గడపకు మన ప్రభ్యుత్వం కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ జిల్లా వైస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పశ్చిమ నియోజకవర్గ శాసన సభ్యులు వెలంపల్లి శ్రీనివాసరావు గారు వర్షాన్ని సైతం లెక్కచేయకుండా ప్రజలవద్దకు వెళ్లి వారి సమస్యలు తెలుసుకున్నారు. ఈ సందర్బంగా మాతంగి వారి వీధి,ఎరువ ప్రకాశం వీధి,బుదాల వారి వీధి,చిలకా మర్తమ్మ వీధి, కటికల వారి వీధి మరియు తదితర ప్రాంతాలలో పర్యటించి గడప గడపకు వెళ్లి ప్రజలకు ఈ మూడేళ్ల కాలంలో ప్రభుత్వ పరంగా జరిగిన సంక్షేమ పథకాల వివరాలు తెలియచేస్తూ సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, స్థానిక కార్పొరేటర్ బుల్లా విజయకుమార్, జి సుదీర్, బూదాల శ్రీను, యర్రజొన్న విజయలక్ష్మి,తంగిరాల కృప,పల్లెపోగు ప్రసాద్, చేపూరి శ్రీను, బత్తిన నాగ పావని, బెవర బాలకృష్ణ, బడుగు అప్పారావు, మేదర కృష్ణ, మీసాల మహేష్, జి విల్సన్, ఆర్ మోజెస్ వివిధ డివిజన్ల కార్పొరేటర్లు,వివిధ కార్పొరేషన్ల చేర్మెన్లు,డైరెక్టర్లు,పార్టీ నాయకులూ, కార్యకర్తలు సచివాలయ సిబ్బంది వాలంటరీస్ మరియు నగరపాలక సంస్థ మరియు రెవిన్యు అధికారులు తదితర విభాగాల అధికారులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రజలందరికీ సురక్షితమైన, స్వచ్ఛమైన తాగు నీరందించేలా చర్యలు

-నీటి సరఫరాలో నాణ్యతా లోపాలు లేకుండా నిరంతర పర్యవేక్షణ -⁠ఆధునీకరించి నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచి నీటి పథకాన్ని ప్రారంభించిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *