Breaking News

సచివాలయాలు ప్రజల సమస్యల పరిష్కారానికి దిక్సూచికలు…

-కలెక్టర్‌ ఎస్‌ డిల్లీరావు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
సచివాలయ అధికారులు సిబ్బంది ప్రజలకు అందుబాటులో ఉండి వారి అవసరాలు తీర్చాలని జిల్లా కలెక్టర్‌ ఎస్‌. డిల్లీరావు అధికారులను ఆదేశించారు. దుర్గాపురం సాంబమూర్తి రోడ్‌ నగరపాలక సంస్థ 198 వార్డు సచివాలయాన్ని బుధవారం కలెక్టర్‌ ఆకస్మికంగా తనిఖీ చేసి ప్రజలకు అందుతున్న సేవలను సచివాలయ సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ డిల్లీరావు మాట్లాడుతూ వార్డు/ గ్రామ సచివాలయలు ప్రజల సమస్యల పరిష్కారానికి దిక్సూచిలాంటివి అని పారదర్శకమైన సేవలందించి సచివాలయల వ్యవస్థ ఏర్పాటు ఉద్దేశాలను నెరవేర్చాలని జిల్లా కలెక్టర్‌ ఎస్‌ డిల్లీరావు అన్నారు. బారీ వర్షాల వలన నగరంలో రహదారులు డ్రైన్లలో చెత్తను ఎప్పటికప్పుడు
శుభ్రం చేయాలని అన్నారు. అపరిశుభ్రత వల్ల రోగాలు ప్రబలే అవకాశం ఉందన్నారు. ప్రజలు రోడ్లపై చెత్త వేయకుండా ఇంటింటికి వెళ్లి చెత్త సేకరణ విధానాన్ని నగర ప్రజలకు తెలపాలన్నారు. వార్డులో అర్హత కలిగిన ప్రతీ ఒక్కరికీ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల లబ్ది చేకూరేలా సచివాలయ సిబ్బంది కృషి చేయాలన్నారు. ప్రభుత్వ పాలనను పేదల గుమ్మం వద్దకు తీసుకువెళ్లేందుకు రాష్ట్ర ప్రభుత్వం గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేసిందని, ప్రభుత్వ ఆశయాల మేరకు సచివాలయ సిబ్బంది విధులు నిర్వర్తించి ప్రజలకు సుపరిపాలన అంధించాలన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్దిదారుల జాబితాలను ప్రథకాల వారీగా వార్డులలో సచివాలయ నోటీసు బోర్డులలో ప్రదర్శించాలని, అదేవిధంగా అనర్హుల జాబితాలను, అనర్హతకు గల కారణాలను కూడా తెలియజేస్తూ నోటీసు బోర్డులో ప్రదర్శించాలన్నారు. గ్రామ సచివాలయంలో ప్రతీరోజు మధ్యాహ్నం 3 గంటల నుండి స్పందన కార్యక్రమం నిర్వహించి ప్రజల నుండి వారి సమస్యలకు సంబంధించి విజ్ఞప్తులను స్వీకరించాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న అభివృద్ధి సంక్షేమ పథకాలను అర్హులైన లబ్దిదారులు సద్వినియోగం చేసుకునే విధంగా సచివాలయ సిబ్బంది ప్రజలకు అవగాహన కల్పించాలని అన్నారు. సచివాలయాలకు వచ్చే ప్రజలతో సిబ్బంది మార్యాదపూర్వకంగా వ్యవహరించి సమస్యలను పరిష్కరించాలన్నారు. విజ్ఞప్తులను ఏరోజు కారోజు సంబంధింత శాఖలకు పంపించి త్వరితగతిన పరిష్కారం జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ సందర్భంగా ప్రజలకు అందిస్తున్న సేవలను గురించి సచివాలయ సిబ్బందిని కలెక్టర్‌ డిల్లీరావు అడిగి తెలుసుకున్నారు. జిల్లా కలెక్టర్‌ వెంట వివిధ శాఖల అధికారులు ఉన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రయాణ సమయంలో ప్రయాణికులకు అసౌకర్యం కల్పించిన వారి పై చట్ట రీత్యా కఠిన చర్యలు

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : సంక్రాంతి పండుగ సందర్భంగా గురువారం రాజమహేంద్రవరం జిల్లా రవాణా అధికారి వారి కార్యాలయంలో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *