Breaking News

సంచార జాతుల వారందరూ ఐక్యతతో పని చేయాలి… : ఎమ్మెల్సీ జంగా

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ ప్రెస్ క్లబ్ లో రాష్ట్ర సంచార జాతుల సంఘం ముఖ్యనాయకుల సమావేశం బుధవారం జరిగింది. ఈ సమావేశానికి ముస్లిం సంచారజాతుల రాష్ట్ర అధ్యక్షులు షేక్ జావిద్ అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా, వైఎస్ఆర్సిపి బీసీ విభాగం అధ్యక్షులు మరియు ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి, రాష్ట్ర ఫైబర్ నెట్ కార్పొరేషన్ చైర్మన్ గౌతమ్ రెడ్డి , రాష్ట్ర ఎంబీసీ కార్పొరేషన్ చైర్మన్ పెండ్ర వీరన్న మరియు రాష్ట్ర నలుమూలల నుండి ప్రముఖ నాయకులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి మాట్లాడుతూ సంచార జాతుల వారందరూ ఐక్యమత్యంతో పని చేయాలని ఆ సామాజిక వర్గాల సామాజిక, సాంఘిక, ఆర్థిక అసమానతలు పోయే విధంగా మనందరం కృషి చేయాలని సీఎం జగన్మోహన్ రెడ్డి  ప్రవేశపెట్టిన పథకాలు ఆయా ప్రాంతాల్లో ఉన్న మన సామాజిక వర్గాల వారికి అందేలా చూడాలని ఆయన అన్నారు. చైర్మన్ గౌతమ్ రెడ్డి  మాట్లాడుతూ అనగారిన వర్గాలకు గుర్తింపునిచ్చిన సీఎం జగన్మోహన్ రెడ్డి కి సంచార జాతుల వారు ఆయనకి అండగా ఉండాలని వైఎస్ఆర్ పార్టీ తరపున మేము పూర్తి సహకారం అందిస్తామని ఆయన అన్నారు. ఎంబీసీ కార్పొరేషన్ చైర్మన్ పెండ్ర వీరన్న మాట్లాడుతూ బాధ్యతలు తీసుకున్న ప్రతి ఒక్కరూ కష్టపడి పనిచేస్తే సమాజం గుర్తిస్తుందని తప్పనిసరి అన్ని సామాజిక వర్గాల వారిని కలుపుకుని ముందుకెళ్లి రాష్ట్ర కమిటీ, జిల్లా కమిటీ బాధ్యతలు తీసుకున్న ప్రతి ఒక్కరు మరింత కష్టపడి పనిచేసి సంఘానికి మంచి గుర్తింపు తీసుకురావాలని ఆయన అన్నారు. అనంతరం కొంతమందిని రాష్ట్ర కమిటీలోకి మరి కొంతమందిని జిల్లాల అధ్యక్షులుగాను బాధ్యతలు అప్పగించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గా షేక్ జావిద్, ఉపాధ్యక్షులుగా అన్నపురెడ్డి శేఖర్, గౌరవ సలహాదారిగా గంట నరసింహమూర్తి, అధికార ప్రతినిధిగా అనపర్తి ఏడుకొండలు, కార్యదర్శులుగా చల్ల రామయ్య, అన్నపరెడ్డి వీరరాఘవులు, కత్తి కొండయ్య, మరియు కొంతమందిని జిల్లా అధ్యక్షులుగా ఎంపిక చేయటం జరిగింది.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

గుంటూరు నగరంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ మరియు మహిళా ఓటర్ల గుర్తింపు ప్రక్రియ ప్రారంభం : నగర కమిషనర్ మయూర్ అశోక్

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వుల (G.O.Rt.No. 1165, MA&UD Department) ప్రకారం గుంటూరు నగర …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *