విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
అమెరికాలోని ఒరెగాన్‌లో జరిగిన ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్ జావెలిన్ త్రోలో రజత పతకం సాధించిన ఒలింపియన్ నీరజ్ చోప్రాను ఆంధ్ర ప్రదేశ్ గవర్నర్ మాననీయ బిశ్వభూషణ్ హరి చందన్ అభినందించారు. అంజు బాబీ జార్జ్ తర్వాత ప్రపంచ ఈవెంట్‌లో పతకం సాధించిన రెండో భారతీయునిగా నీరజ్ రికార్డులకు ఎక్కారు. 88.13 మీటర్ల లక్ష్యాన్ని సాధించి దేశం గర్వించేలా చేశారని గవర్నర్ అన్నారు. భవిష్యత్ ఈవెంట్‌లలో మరింత మెరుగైన ప్రతిభను చూపాలని, తద్వారా మరిన్ని విజయాలు సాధించాలని గౌరవ బిశ్వ భూషణ్ హరి చందన్ ఆకాంక్షించారు. ఈ మేరకు రాజ్ భవన్ నుంచి ఒక ప్రకటన విడుదల చేశారు.
Tags vijayawada
Check Also
“సామాజిక స్పృహ కలిగించే కథలు రావాలి”
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : “సామాజిక స్పృహ కలిగించే కథలు రావాలి” , దాని వల్ల ప్రజల్లో అనేక …