ఆగస్టు 31 కల్లా ఋణాల మంజూరు ప్రక్రియను పూర్తి చేయాలి… : జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా

గుడివాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఈ ఆగస్టు 31 కల్లా ఋణాల మంజూరు ప్రక్రియ పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా అధికారులను ఆదేశించారు. సోమవారం ఆయన స్థానిక పాత మున్సిపల్ కార్యాలయ భవనంలో గుడివాడ శాసన సభ్యులు, మాజీ మంత్రి కొడాలి నానితో కలసి టిడ్కో గృహాలకు రుణాల మంజూరు ప్రక్రియపై బ్యాంకు అధికారులతో పట్టణ స్థాయి బ్యాంకర్ల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ టిడ్కో గృహాలకు రుణాల మంజూరు ప్రక్రియను వేగవంతం చేయాలని, ఆగష్టు 31 కల్లా ఈ ప్రక్రియను పూర్తి చేయాలన్నారు. దానితో పాటుగా సెప్టెంబర్ చివరికి రిజిస్ట్రేషన్లు చేయాలని చెప్పారు. ఆయన బ్యాంకుల వారీగా సమీక్ష చేస్తూ కొన్ని బ్యాంకులు మాత్రమే రుణాల మంజూరులో ముందుకెళ్తున్నాయని, మిగిలిన బ్యాంకులు వేగం పెంచాలన్నారు. ఏ ఏ రోజుల్లో లబ్ధిదారులకు రుణాలను మంజూరు చేసేది ముందుగానే షెడ్యూల్ రూపొందించి లబ్ధిదారులకు బ్యాంకర్లు తెలియజేయాలన్నారు. సిబిల్ స్కోరు, 60 సంవత్సరాల వయస్సు సమస్య తలెత్తిన వారికి అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు. మరే ఇతరమైన సమస్యలు తలెత్తిన పిడి మెప్మా, మున్సిపల్ కమీషనర్, ఎల్డియం దృష్టికి బ్యాంకు అధికారులు తీసుకురావాలన్నారు. ఇంకా పదమూడు వందల అప్లికేషన్లు బ్యాంకులకు సమర్పించాల్సి ఉందని, దీనిపై దృష్టి పెట్టి ప్రక్రియను పూర్తి చేయాలని పిడి మెప్మా అధికారిణి విశాలాక్షి ని ఆయన ఆదేశించారు.

గుడివాడ డివిజన్ జగనన్న లే అవుట్లు, రీసర్వేపై సమీక్ష…
గుడివాడ డివిజన్ పరిధిలోని జగనన్న లేఅవుట్లపై మండలాల వారీగా జిల్లా కలెక్టర్ పి రంజిత్ బాషా సమీక్ష నిర్వహించారు. సోమవారం సాయంత్రం స్థానిక పాత మున్సిపల్ కార్యాలయ భవనంలో ఆయన గుడివాడ శాసన సభ్యులు, మాజీ మంత్రి కొడాలి నానితో కలసి జగనన్న లే అవుట్లు, రీ సర్వే ప్రక్రియ పురోగతిపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జగనన్న లేఅవుట్లలో ఇళ్ల నిర్మాణ సామాగ్రిని చేర్చడానికి అప్రోచ్ రోడ్ల నిర్మాణం, మౌలిక సదుపాయాలు కల్పనపై హౌసింగ్ అధికారులు ప్రత్యేక శ్రద్ధ పెట్టాలన్నారు. అవసరమైన చోట్ల బోర్లు వేసి నీటి వసతి కల్పించాలన్నారు. నాన్ స్టార్టెడ్ దశ నుంచి స్టార్టెడ్ దశకు ఇళ్లను ముందుకు తీసుకెళ్లాలని అన్నారు. గన్నవరం, బాపులపాడు మండలాల లేఅవుట్లు పురోగతిలో వెనుకబడి ఉన్నాయని, ఈ విషయంలో ఎంపిడిఓ, తాసిల్డార్లు ప్రత్యేక శ్రద్ధ పెట్టాలన్నారు. అదేవిధంగా రీసర్వే ప్రక్రియను వేగవంతం చేయాలని సర్వే అధికారులను కలెక్టర్ ఆదేశించారు. సెప్టెంబర్ 15 కల్లా నిర్దేశించిన లక్ష్యాలను పూర్తి చేయాలన్నారు. గ్రౌండ్ ట్రూతింగ్, గ్రౌండ్ వాలిడేషన్, 13 వ నోటిఫికేషన్ల ప్రక్రియలు పూర్తి చేయాలని అధికారులను ఆయన ఆదేశించారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్, టిడ్కో ప్రాజెక్ట్ ఆఫీసర్ బి.చిన్నోడు, ఆర్డీవో పి.పద్మ, గుడివాడ మున్సిపల్ కమీషనర్ సంపత్ కుమార్, హౌసింగ్ పిడి ఎన్ రామచంద్రన్ ఎంపిడిఓ లు, తాసిల్దార్లు, ఇంజనీర్లు, సర్వేయర్లు ఇతర అధికారులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రతి నెలా చేనేత ఎగ్జిబిషన్లు ఏర్పాటు

-మంత్రి సవిత వెల్లడి -నికె హ్యాండ్లూమ్ మార్కెటింగ్ ఎక్స్ పో 2024-25 ను ప్రారంభించిన మంత్రి -నేతన్నలకు 365 రోజులు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *