అభాగ్యులకు ఆర్థిక భరోసా ముఖ్యమంత్రి సహాయనిధి: ఎమ్మెల్యే మల్లాది విష్ణు

-ఎమ్మెల్యే చేతులమీదుగా రూ. లక్ష విలువైన ఎల్ఓసి పత్రం అందజేత

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
నిరుపేదల ఆరోగ్యానికి రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా భరోసా కల్పిస్తోందని ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. 63వ డివిజన్ రాజీవ్ నగర్ కు చెందిన డేరంగుల లక్ష్మీ(34) గత కొద్దికాలంతో తుంటి సంబంధిత సమస్యతో బాధపడుతున్నారు. ఆమె కుటుంబ ఆర్థిక దుస్థితిని ఎమ్మెల్యే మల్లాది విష్ణు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లగా.. రూ. లక్ష విలువైన ఎల్ఓసి మంజూరు చేయడం జరిగింది. ఆంధ్రప్రభ కాలనీలోని జనహిత సదనము నందు ఎల్ఓసి పత్రాన్ని శనివారం ఎమ్మెల్యే చేతులమీదుగా అందజేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజారోగ్యానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని.. అందులో భాగంగానే ఆరోగ్యశ్రీకి పునర్వైభవం తీసుకువచ్చి పేద ప్రజలకు ఉచిత వైద్యం అందేలా చర్యలు తీసుకున్నారని మల్లాది విష్ణు తెలిపారు. అలాగే అనారోగ్యానికి గురై అత్యవసర సమయంలో ప్రైవేటు ఆసుపత్రుల్లో వైద్య సేవలు పొంది ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న కుటుంబాలను ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా ఆదుకుంటున్నారని పేర్కొన్నారు. అదే చంద్రబాబు పాలనలో పేద రోగులు ఆర్థిక భారంతో చితికిపోయేవారని.. వైఎస్సార్ సీపీ అధికారంలోకి వచ్చాక సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి చొరవతో ఆపదలో ఉన్న ప్రతిఒక్కరికీ ముఖ్యమంత్రి సహాయనిధి అందుతోందన్నారు. గత మూడేళ్లలో సెంట్రల్ నియోజకవర్గంలో 885 మందికి రూ. 4 కోట్ల 10 లక్షల 6 వేల రూపాయలకు సంబంధించి సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందజేయడం జరిగిందన్నారు. 88 మందికి రూ. 2 కోట్ల 26 లక్షల 12 వేల రూపాయలకు సంబంధించి ఎల్ఓసి పత్రాలను అందించినట్లు చెప్పారు. కనుక ఆపద వస్తే అధైర్యపడకుండా పేదలందరూ ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. మరోవైపు రోగులకు ఆరోగ్యశ్రీ ఉన్న ఆస్పత్రులపై అవగాహన కల్పించేందుకు ప్రతి ఆరోగ్యశ్రీ నెట్‌ వర్క్‌ ఆస్పత్రుల్లో హెల్ప్‌ డెస్కులను ఏర్పాటు చేసి ఆరోగ్య మిత్రలను నియమించడం జరిగిందని మల్లాది విష్ణు తెలిపారు. అలాగే నియోజకవర్గ పార్టీ కార్యాలయంలోనూ హెల్ప్ డెస్క్ ను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ఆర్థిక ఇబ్బందులలో ఉన్న తమకు చేయూతనిచ్చిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి, ఎమ్మెల్యే మల్లాది విష్ణుకి లబ్ధిదారుని కుటుంబసభ్యులు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేశారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

“ఈ డిస్ట్రిక్ట్ మేనేజర్ ” దరఖాస్తులు స్వీకరణ

-దరఖాస్తు చేసుకున్న వారి జాబితా వెబ్ సైట్ లో అప్లోడ్ చెయ్యడం జరిగింది -ఈనెల 16 వ తేదీ సా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *