విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా ప్రజాసమస్యల పరిష్కారానికి తూర్పు నియోజకవర్గంలోని 6వ డివిజన్ లో స్థానిక డివిజన్ కార్పొరేటర్ వియ్యపు అమర్నాధ్ ఆధ్వర్యంలో 33వ సచివాలయ పరిధిలోని గులాముద్దీన్ నగర్ కృష్ణుడి గుడి నుండి మొదలై కొండ ప్రాంతం,ముత్యాలమ్మ గుడి రోడ్, వీరన్న స్ట్రీట్,భగీరథమ్మ స్ట్రీట్ మరియు మసీద్ రోడ్ ప్రాంతాలలో తూర్పు నియోజకవర్గ వైస్సార్సీపీ ఇంచార్జ్ దేవినేని అవినాష్ పాల్గొని వైసీపీ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి,సంక్షేమ పథకాలను వారికి వివరించి,వారు పొందిన లబ్ధి వివరాలతో కూడిన సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంతకం చేసిన కరపత్రాలను అందచేసి,మన ప్రభుత్వం రావడం వలన మీకు ఇన్నిన్ని ప్రయోజనాలు చేకూరడం జరుగుతుంది అని, అలానే నియోజకవర్గాన్ని కూడా అన్ని విధాలుగా అభివృద్ధి చేయడం జరుగుతుందని,అవినీతి రహిత పాలన అందించడమే కాకుండా మీకు అందరికీ తోడు నీడగా నిలుస్తున్న మన ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి కి మీరంతా బాసటగా నిలవాలి అని అన్నారు. ,ఆయనకు మీ అందరి దీవెనలు,ఆశీర్వాదాలు అందచేయాలని, మళ్ళీ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి ని చేయాలని కోరారు. అవినాష్ రాకతో డివిజన్ ప్రజలు బ్రహ్మరధం పట్టారు. కొండ చివరి అంచున ఉన్న ఏ గడపకు వెళ్ళినా ఆప్యాయంగా ఆహ్వానం పలుకుతూ స్వయానా ఇంటికి విచ్చేయడం,తమ కష్టసుఖాలు అడిగి తెలుసుకుని ప్రభుత్వ తరుపున మరింతగా అండగా నిలుస్తాము అని భరోసా ఇవ్వడం చాలా గొప్ప విషయం అని తాము ఇంత వరకు ఏ ప్రభుత్వంలో కూడా చూడని గొప్ప పరిపాలనను చూస్తున్నాం అని ప్రజలు హర్షం వ్యక్తం చేసారు. స్థానిక ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీ మేరకు కొండ ప్రాంతం అధికంగా ఉన్న ఈ డివిజన్ అంతటికీ మంచినీటి సమస్య పరిష్కారం అయ్యేలా పైప్ లైన్ ఏర్పాటు చేయడంతో పాటు పెండింగులో ఉన్న నూతన మెట్ల మార్గాలు,రోడ్డు నిర్మాణాలు శంకుస్థాపన చేసి కొన్ని ప్రారంభించడం కూడా జరిగింది అన్నారు. ప్రజలకు ఏ సమస్య వచ్చిన,అర్హత ఉండి ఏ సంక్షేమ పధకం అందకపోయిన తన దృష్టికి తీసుకువస్తే తక్షణమే పరిష్కారం అయ్యేలా చూస్తానని హామీ ఇచ్చారు.ప్రజలు వద్దకు వెళ్తుంటే జగన్ పాలన గురించి చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. గత టీడీపీ ప్రభుత్వం లో స్థానిక ఎమ్మెల్యే నిధులు ఇవ్వకుండా అభివృద్ధి ని నిర్లక్ష్యం చేసారని విమర్శించారు. మరలా ఇప్పుడు వైస్సార్సీపీ ప్రభుత్వం లో కోట్ల రూపాయలు నిధులు మంజూరు చేపించి నూతన మెట్లు, డ్రైనేజీ వ్యవస్థ నిర్మాణాలు,మంచినీటి సమస్య పరిష్కారానికి వాటర్ ట్యాంక్ నిర్మాణం చేపట్టినట్టు తెలిపారు. వాలంటీర్ వ్యవస్థ ద్వారా గతంలో మాదిరిగా జేబులో వేసుకుని ప్రజల దగ్గర బాదకుండా వారి సోమ్ము వారికే ఎటువంటి దళారుల జేబులో కి పోకుండా అందివ్వడం జరుగుతుంది అని అన్నారు.గద్దె రామ్మోహన్ మహిళలకు అన్నదానం చేస్తూ అలాంటి మంచి కార్యక్రమం చేస్తూ ప్రజలకి జగన్మోహన్ రెడ్డి చేసే సంక్షమేమం గురించి అసత్య ప్రచారం చేయడం సిగ్గు చేటు,కరోనా కష్టకాలం లో సంక్షేమ పథకాలు డబ్బులు నేరుగా ప్రజల ఖాతాలో పడి మాకు ఎంతో ఉపయోగపడుతున్నాయి అని ప్రజలు సంతోషం గా ఉంటె అన్నదాన కార్యక్రమం పెట్టి మహిళలకు పిచ్చి పిచ్చి మాటలను చెప్పి వారి రాజకీయ మనుగడ కోసమే అసత్య ప్రచారాలు చేస్తున్నారు అని దుయ్యబట్టారు సంక్షేమ పథకాలను ఇళ్ల వద్దకే చేరుస్తున్న ఘనత జగన్ గారిదే అని,ఇంకోసారి మీ రాజకీయ మనుగడ కోసం ఇలాంటి షో రాజకీయాలు చేస్తే ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గ, రాష్ట్ర తూర్పు కార్పొరేషన్ వెల్ఫేర్ డైరక్టర్ ఇజ్జాడ తేజేష్, జి.జి.ఎచ్ డైరక్టర్ ప్రభు దాస్, గాంధీ కోపరేటివ్ బ్యాంక్ డైరెక్టర్ శ్రీనివాస్, వైస్సార్సీపీ నాయకులు నర్సయ్య, శ్రీను, పడాల లక్ష్మణ్, సిమెంట్ ప్రసాద్, హుస్సేన్, నామాల కోటేశ్వర రావు, రామారావు, డాలి తదితరులు పాల్గొన్నారు.