విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఇటీవల తూర్పు నియోజకవర్గ పరిధిలోని ‘గడపగడపకు మన ప్రభుత్వం’ కార్యక్రమంలో భాగంగా తూర్పు నియోజకవర్గ వైస్సార్సీపీ ఇన్ ఛార్జ్ దేవినేని అవినాష్ పర్యటించినప్పుడు 6వ డివిజన్ వైశ్యరాజుల సింహాచలం అద్దె జీవనోపాధికి ఇబ్బందులు పడుతున్న విషయం అవినాష్ దృష్టికి తీసుకురాగా శనివారం నాడు వారికి ‘దేవినేని నెహ్రూ చారిటబుల్ ట్రస్ట్’ ద్వారా రూ.20,000/-విలువ చేసే తోపుడు బండిని దేవినేని నెహ్రు ట్రస్ట్ ద్వారా వారికీ అందజేశారు.అదేవిధంగా 16వ డివిజన్ కి చెందిన చెక్కా శివాజీ కి వైద్య ఖర్చులు నిమిత్తం 5,000 రూపాయలు ఆర్డక సహాయం చేసారు. ఈ సందర్భంగా అవినాష్ మాట్లాడుతూ మా చారిటీ సంస్థ ద్వారా ఎన్నో వేల మందికి ఉపాధి, విద్య రంగాలలో అండగా నిలుస్తున్నాం అని అన్నారు .రాబోయే రోజుల్లో కూడా మా సేవా కార్యక్రమాలు ఇలాగే నిరాటంకంగా జరుపుతామని నా పూర్తి సహాయసహకారాలు ఉంటాయని అవినాష్ తెలిపారు.
Tags vijayawada
Check Also
అక్రమ మైనింగ్ కు వినియోగిస్తున్న మూడు పొక్లెయిన్ లు సీజ్
-19 మంది అధికారులు, సిబ్బంది సమక్షంలో దాడులు -జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి కడియం, నేటి పత్రిక ప్రజావార్త : …