-నగర పాలక సంస్థ కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
16వ డివిజన్ పరిధిలోని గీతానగర్, దూరదర్శన్ కాలనీ, పోలీస్ కాలనీ తదితర ప్రాంతాలలో నగరపాలక సంస్థ కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఐ.ఏ.ఎస్, క్షేత్ర స్థాయిలో అధికారులతో కలసి పర్యటించి స్థానంగా ఉన్న పలు సమస్యలను పరిశీలించారు. గీతానగర్ నందు అందుబాటులో ఉన్న రెవిన్యూ స్థలము నందు నగరపాలక సంస్థ పాఠశాల స్కూల్ భవనం నిర్మాణము చేపట్టుటకై కలెక్టర్ వారి నుండి అనుమతి పొందుటకు చర్యలు తీసుకోవాలని సంబందిత అధికారులను ఆదేశించారు. గీతానగర్ నది వెంబడి క్రాబ్ వాల్ మరియు అప్రోచ్ రోడ్ ఏర్పాటుకు అవసరమగు అంచనాలు రూపొందించి సమర్పించాలని అన్నారు. అదే విధంగా 15వ ఆర్ధిక సంఘ నిధుల నుండి గీతానగర్ ప్రొటెక్షన్ వాల్, గ్రీనరి, ఎవెన్యూ ప్లాంటేషన్ పనులు చేపట్టుటకు అవసరమగు టెండర్ పనులు చేపట్టి పనులు ప్రారంభించుటకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
తదుపరి దూరదర్శన్ క్వాట్టర్స్ ముందు గల సర్వీస్ రోడ్ నందు రోడ్ వెడల్పు వదిలి మిగిలిన మార్జిన్ యందు పవేర్ బ్లాక్ మరియు గ్రీన్ బెల్ట్ అభివృద్ధి చర్యలు తీసుకోవాలని మరియు పోలీస్ కాలనీ నుండి నగరపాలక సంస్థ సరిహద్దు గల రిటైనింగ్ వాల్ వద్ద ఎటువంటి ఆక్రమణలకు గురికాకుండా చూడాలని సంబందిత అధికారులను ఆదేశించారు. అదే విధంగా పోలీస్ కాలనీ నందు జరుగుతున్న కవిడ్ బూస్టర్ డోస్ వ్యాక్సినేషన్ విధానము పరిశీలించి విధులలో ఉన్న సిబ్బందిని వివరాలు అడిగితెలుసుకొని పలు సూచనలు చేస్తూ, 18 సంవత్సరాలు పైబడిన వారందరికి తప్పనిసరిగా బూస్టర్ డోస్ వేసుకోనేలా అవగాహన కల్పించాలని అన్నారు.
పర్యటనలో స్థానిక కార్పొరేటర్ ఉమ్మడిశేటి రాధిక, మాజీ కార్పొరేటర్ బహదూర్, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ చంద్ర శేఖర్, హెల్త్ ఆఫీసర్ డా.ఇక్బాల్ హుస్సేన్ మరియు ఇతర అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.