Breaking News

ఆగస్టు 15న జిల్లాలో 24 చెరువుల వద్ద అమృత్‌ సరోవర్‌ ఉత్సవాలు..

-చెరువులను అభివృద్ధి చేసి పార్కు వాకింగ్‌ ట్రాక్‌ల ఏర్పాటు..
-గ్రామీణ ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణం కల్పింస్తున్నాం..
-జిల్లా కలెక్టర్‌ ఎస్‌ డిల్లీరావు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఉపాధి హామి పనుల ద్వారా జిల్లాలో 24 చెరువులను అభివృద్ధి చేసి సుందరీకరిస్తున్నామని చెరువుల చుట్టూ మొక్కలు నాటి పార్కు వాకింగ్‌ ట్రాక్‌లను ఏర్పాటు చేసి ఆగస్టు 15వ తేదీన అమృత్‌ సరోవర్‌ ఉత్సవాలను నిర్వహిస్తున్నామని జిల్లా కలెక్టర్‌ ఎస్‌ డిల్లీరావు తెలిపారు.
నందిగామ మండలం లింగాలపాడు గ్రామంలో 10.38 లక్షల రూపాయల ఉపాధి హామి నిధులతో అభివృధ్ధి చేసిన చెరువును శనివారం డ్వామా అధికారులతో కలిసి కలెక్టర్‌ డిల్లీరావు పరిశీలించారు. ఈసందర్భంగా జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లాలో ఉపాధి హామి నిధుల ద్వారా 24 చెరువులను అభివృద్ధి చేస్తున్నామని ఇప్పటికే 22 చెరువుల అభివృద్ధి పనులు పూర్తి చేయడం జరిగిందని మరో రెండు చెరువుల అభివృద్ధి పనులు దాదాపు పూర్తి కావచ్చాయన్నారు. అభివృద్ధి చేసిన చెరువుల చుట్టూ మొక్కలు నాటి పచ్చటి గడ్డలో వాకింగ్‌ ట్రాక్‌లు సిమ్మెంట్‌ బెంచ్‌లను ఏర్పాటు చేస్తున్నామని గ్రామీణ ప్రజలకు కూడా పట్టణ పార్కులలో మాదిరిగా ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కల్పించనున్నామన్నారు. రెండు ఎకరాల విస్థీర్ణం కలిగిన లింగాలపాడు చెరువును 10.38 లక్షల రూపాయల ఉపాధి హామి నిధులతో అభివృద్ధి చేయడం జరిగిందన్నారు. చెరువును అభివృద్ధి చేయడం ద్వారా 51 ఎకరాల ఆయు కట్టుకు సంపూర్ణంగా సాగునీరు అంధించడం జరుగుతుందన్నారు. గ్రామానికి అతి సమీపంలో ఉన్న చెరువు ను పూర్తిగా అభివృద్ధి చేసి చెరువు గట్ల చుట్టూ ఫలసాయపు మొక్కలను నాటాడం జరిగిందని రిటైర్డ్‌ ఆర్మీ అధికారి సహకారంతో సిమెంట్‌ బల్లలను ఏర్పాటు చేసి ఆహ్లాదకరమైన వాతావరణాన్ని తీసుకురావడం జరిగిందన్నారు. జనరల్‌ ఫండ్స్‌ నిధులతో చెరువుల చుట్టూ వాకింగ్‌ ట్రాక్‌లను ఏర్పాటు చేసి ఉదయం సాయంత్రం నడక అలవాటు చేయాలని అధికారులకు సూచించమని కలెక్టర్‌ తెలిపారు. ఈ ఏడాది 30 లక్షల పనిదినాలు కల్పించాలని ప్రభుత్వం లక్ష్యాన్ని నిర్థేశించగా ఇప్పటివరకు రికార్డు స్థాయిలో 50 లక్షల పనిదినాలు కల్పించడం జరిగిందన్నారు. జిల్లాలో 1.23 లక్షల కుటుంబాలలోని 2.12 లక్షల మంది కూలీ కార్మికులు పనులు చేస్తున్నారన్నారు. వీరిలో 59.04 మంది మహిళా కార్మికులు ఉపాధి హామి పనులలో పాల్గొన్నారన్నారు. విస్సన్నపేట, మైలవరం, జి. కొండూరు, నందిగామ, చందర్లపాడు, వీరులపాడు, జగ్గయ్యపేట తదితర మండలాలలో 24 చెరువులలో పూడిక తీత పనులు పూర్తి చేసి ఆధునీకరించిన చెరువుల వద్ద స్థానిక స్వాతంత్య్ర సమరయోదులు ప్రజాప్రతినిధులతో ఆగస్టు 15వ తేదీన జాతీయ జెండా ఆవిష్కరించి అమృత సరోవర్‌ ఉత్సవాన్ని నిర్వహిస్తామన్నారు. లక్ష్యాన్ని మించి కూలీలకు ఉపాధి హామి పనులను కల్పించేందుకు కృషి చేసిన డ్వామా ప్రాజెక్టు డైరెక్టర్‌, ఏపియంలు, ఇంజనీరింగ్‌, కన్సల్టెంట్లు, టెక్నికల్‌ అసిస్టెంట్లను ప్రత్యేకంగా అభినందిస్తున్నట్లు జిల్లా కలెక్టర్‌ డిల్లీరావు తెలిపారు.
కార్యక్రమంలో డ్వామా జిల్లా ప్రాజెక్టు డైరెక్టర్‌ జె.సునీత, స్థానిక యంపిడివో పి శ్రీనివాసరావు. తహాశీల్థార్‌ ఎస్‌ నరసింహరావు, గ్రామ సర్పంచ్‌ బి. పద్మజ, యంపిటిసి జి. నరసింహరావు, స్థానిక నాయులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

“ఈ డిస్ట్రిక్ట్ మేనేజర్ ” దరఖాస్తులు స్వీకరణ

-దరఖాస్తు చేసుకున్న వారి జాబితా వెబ్ సైట్ లో అప్లోడ్ చెయ్యడం జరిగింది -ఈనెల 16 వ తేదీ సా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *