మీరు అనాదలు కారు… మీ అందరికి మేమే బంధువులం…

-ఉన్నత చదువులు చదివి మంచి పౌరులుగా ఎదగాలి…
-అనాదబాలలతో క్రికెట్‌ ఆడి సందడి చేసిన కలెక్టర్‌ డిల్లీరావు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
అనాదబాలలను అక్కున చేర్చుకుని ఆదరించి వారిని సమాజంలో ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దడంలో స్వచ్ఛంద సంస్థల సహకారం అభినందనీయమని జిల్లా కలెక్టర్‌ ఎస్‌ డిల్లీరావు అన్నారు.
భవానిపురంలోని ప్రేమ్‌ విహార్‌ ఎస్‌కెసివి చిల్డ్రన్‌ ట్రస్ట్‌లో ఇండియన్‌ రెడ్‌క్రాస్‌ సొసైటి, ఎల్‌విప్రసాద్‌ కంటి ఆసుపత్రి సంయుక్త ఆధ్వర్యంలో అనాదబాలలకు కంటి పరీక్షల కార్యక్రమానికి మంగళవారం జిల్లా కలెక్టర్‌ ఎస్‌ డిల్లీరావు ముఖ్య అతిధిగా హాజరయ్యారు.
తొలుత అనాదబాలలతో జిల్లా కలెక్టర్‌ కొద్దిసేపు క్రికెట్‌ ఆడి సందడి చేశారు. అనంతరం అనాదబాలలతో ముచ్చటిస్తూ మీరు ఎవరూ ఒంటరి వారు కారని మీ అందరికి మేము ఎప్పుడు అండగా ఉంటామన్నారు. ప్రభుత్వం స్వచ్చంద సంస్థలు అందిస్తున్న సహయ సహకారాలను అందిపుచ్చుకుని ఉన్నత చదువులలో రాణిస్తూ ప్రయోజకులై జీవితాలను సాఫల్యం చేసుకుని సమాజంలో కీర్తిప్రతిష్టలు సాధించాలన్నారు. ఎస్‌కెసివిలో ఆశ్రయం పొంది ఉన్నత శిఖరాలకు చెరుకున్న నారాయణ నార్తన్‌, కిషోర్‌టాటా, కమ్మగిరి, పరిటాల హరిబాబు, ఉప్పలపవన్‌, పి హరికృష్ణ, పి భానుప్రకాష్‌ వంటి వారిని ఆదర్శంగా తీసుకోవాలన్నారు. ఎస్‌కెసివి చిల్డ్రన్‌ ట్రస్ట్‌ అనాదబాలలకు అందిస్తున్న సేవలు వారిని తీర్చిదిద్దుతున్న విధానం అభినందనీయమన్నారు. విభిన్నప్రతిభావంతులు అనాధలను ఆధుకునేందుకు స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావాలని జిల్లా కలెక్టర్‌ డిల్లీరావు కోరారు.
ఇండియన్‌ రెడ్‌క్రాస్‌ సొసైటి రాష్ట్ర చైర్మన్‌ డా. శ్రీధర్‌ రెడ్డి మాట్లాడుతూ ఇండియన్‌ రెడ్‌క్రాస్‌ సొసైటి ద్వారా అనాదబాలల సంక్షేమానికి అనేక కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు ఫుట్‌పాత్‌ బస్టాండ్‌ రైల్వే స్టేషన్‌ తదితర ప్రాంతాలలో వీధిబాలలను గుర్తించి వారికి దుస్తులను దుప్పట్లు పంపిణీ చేస్తున్నామని అనాదబాలలను ఎస్‌కెసివి చిల్డ్రన్‌ ట్రస్ట్‌, చైల్డ్‌ లైన్‌ వంటి బాలల సంరక్షణ కేంద్రాలలో ఆశ్రయం కల్పించేలా చర్యలు తీసుకున్నామన్నారు. స్వచ్ఛంద సంస్థలలో నివాసం ఉంటున్న బాలలకు వైద్య పరీక్షలు నిర్వహించి వైద్య సహయాన్ని అందించడంతో పాటు జూనియర్‌ రెడ్‌క్రాస్‌ ద్వారా ఆరోగ్య సంరక్షణ యోగా పై శిక్షణ తరగతులను నిర్వహిస్తున్నామని డా. శ్రీధర్‌రెడ్డి తెలిపారు.
కంటి పరీక్ష కేంద్రాన్ని ప్రారంభించి చిల్డ్రన్‌ ట్రస్ట్‌ అనాదబాలలతో కలిసి జిల్లా కలెక్టర్‌ డిల్లీరావు సహపంక్తి భోజనం చేశారు.
కార్యక్రమంలో ఇండియన్‌ రెడ్‌క్రాస్‌ సొసైటి జిల్లా అధ్యక్షులు డా. జి సమరం, కార్యదర్శి ఇళ్లా రవి, చిల్డ్రన్‌ ట్రస్ట్‌ ఛీప్‌ కో`ఆర్డినేటర్‌ కె. చంద్ర, వార్డన్‌ వెస్లీ తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

“ఈ డిస్ట్రిక్ట్ మేనేజర్ ” దరఖాస్తులు స్వీకరణ

-దరఖాస్తు చేసుకున్న వారి జాబితా వెబ్ సైట్ లో అప్లోడ్ చెయ్యడం జరిగింది -ఈనెల 16 వ తేదీ సా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *