తూర్పు నియోజకవర్గం లో ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
తూర్పు నియోజకవర్గ వైస్సార్సీపీ కార్యాలయం మరియు బెంజ్ సర్కిల్ ఆటో సాండ్ వారి ఆధ్వర్యంలో స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా జండా వందనం కార్యక్రమంలో పాల్గొన్న దేవినేని అవినాష్ అనంతరం అవినాష్ మాట్లాడుతూ ఎందరో మహానుభావులు తమ ప్రాణాలను పణంగా పెట్టి సుమారు 200 సంవత్సరాల నాటి బానిసత్వాన్ని విడిపించి మనకు స్వాతంత్రాన్ని అందించారని అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి 75వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా వజ్రోత్సవ కార్యక్రమాల్లో మనందరినీ భాగం చేసినందుకు ఎంతో ఆనందంగా ఉందని అన్నారు. మనందరం శాంతి సహనంతో ఉంటూ దేశభక్తిని కలిగి దేశ ప్రతిష్టను మరింత పెంచే విధంగా మెలగాలని అన్నారు.తదనంతరం బెంజ్ సర్కిల్ ఆటో స్టాండ్ మరియు నియోజకవర్గ పరిధిలోని వివిధ డివిజన్ లలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆధ్వర్యంలో జరిగిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో అవినాష్ ముఖ్య అతిథిగా పాల్గొని జెండా వందనం చేసి నాయకులు, కార్యకర్తలకు శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో కో ఆప్షన్ సభ్యులు ముసునూరి సుబ్బారావు, కార్పొరేటర్లు ప్రవల్లిక, అంబేద్కర్, వైస్సార్సీపీ నాయకులు డేవిడ్ రాజు,శెటికం దుర్గా ప్రసాద్, రాజ్ కమల్,బచ్చు మురళి, ప్రభు, చెన్నూ తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రతి నెలా చేనేత ఎగ్జిబిషన్లు ఏర్పాటు

-మంత్రి సవిత వెల్లడి -నికె హ్యాండ్లూమ్ మార్కెటింగ్ ఎక్స్ పో 2024-25 ను ప్రారంభించిన మంత్రి -నేతన్నలకు 365 రోజులు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *