Breaking News

ఉత్తమ సేవలు అందించిన అధికారులు ఉద్యోగులకు ప్రశంసా పత్రాలు…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
స్వాతంత్య్ర స్పూర్తితో ప్రజలకు సేవలందిస్తూ జిల్లాను అన్ని రంగాలలో అగ్రగామిగా నిలిపేందుకు సమిష్టిగా కృషి చేద్దామని నూతనంగా ఏర్పడిన ఎన్‌టిఆర్‌ జిల్లా అభివృద్ధిలో భాగస్వామ్యులైన అధికారులు ఉద్యోగులను మనస్పూర్తిగా అభినందిస్తున్నానని జిల్లా కలెక్టర్‌ ఎస్‌ డిల్లీరావు తెలిపారు.
76వ స్వాతంత్య్ర దినోత్సవం పురస్కరించుకుని సోమవారం నగరంలోని పోలీస్‌ పెరేడ్‌ గ్రౌండ్స్‌లో నిర్వహించిన స్వాతంత్య్ర దినోత్సవ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్‌ డిల్లీరావు, జాయింట్‌ కలెక్టర్‌ ఎస్‌ నుపూర్‌ అజయ్‌, నగర పోలీస్‌ కమీషనర్‌ కాంతి రాణా టాటాలు వివిధ శాఖల ద్వారా ఉత్తమ సేవలు అందించిన అధికారులు ఉద్యోగులకు ప్రశంసా పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ స్వాతంత్య్ర స్పూర్తితో ప్రజలకు మెరుగైన సేవలు అందించి జిల్లాను అగ్రగామిగా నిలిపేందుకు సమిష్టిగా కృషి చేద్దామని తెలిపారు. జిల్లాల పునవ్యవస్థకారణతో ఏర్పడిన నూతన ఎన్‌టిఆర్‌ జిల్లాలో ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి పథకాలను ప్రజలకు చేరువ చేయడంలో ప్రభుత్వం కేటాయించిన లక్ష్యాల సాధనపై ప్రతి ఒక్కరూ ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. నవరత్నాలు పేదలందరికి
ఇళ్లు, జగనన్న గృహా నిర్మాణం, వైఎస్‌ఆర్‌ ఆరోగ్యశ్రీ, అమ్మఒడి, వైఎస్‌ఆర్‌ చేయూత, ఆసరా పెన్షన్లు వంటి పథకాలకు సంబంధించి గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థ ద్వారా అర్హులైన ప్రతి లబ్దిదారుని గుర్తించి వారికి సంక్షేమ ఫలాలను అందించాలన్న గౌరవ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆలోచనలకు అనుగుణంగా సేవలందించాలన్నారు. స్పందన కార్యక్రమంలో ప్రజల నుండి స్వీకరించిన ఆర్జీలను ఆర్జీదారుడు సంతృప్తి చెందేవిధంగా సకాలంలో పరిష్కరించాల్సిన భాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. పేద బలహీనవర్గాలకు రైతాంగానికి అవసరమైన సేవలను అందించడంలో ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. ఎన్‌టిఆర్‌ జిల్లా ఏర్పడి కేవలం నాలుగు మాసాలు మాత్రమే పూర్తి అయిన్నప్పటికి ప్రజలకు సేవలందించడంలో అధికారులు, ఉద్యోగులు ఆశించిన మేరకు లక్ష్యాలను సాధిస్తున్నారన్నారు. ఇదే స్పూర్తిని కొనసాగించి రాష్ట్రంలోనే ఎన్‌టిఆర్‌ జిల్లాను మోడల్‌ జిల్లాగా తీర్చిదిద్ధేందుకు కృషి చేయాలన్నారు. ఈనెల 2వ తేదీ నుండి జిల్లాలో నిర్వహించిన అజాదీ కా అమృత్‌ మహోత్సవాలు హర్‌ ఘర్‌ తిరంగా అమృత్‌ సరోవర్‌ కార్యక్రమాలను విజయవంతం చేయడంలో కృషి చేసిన ప్రతి ఒక్కరిని హృదయపూర్వకంగా అభినందిస్తున్నట్లు జిల్లా కలెక్టర్‌ డిల్లీరావు అన్నారు.

ప్రశంసా పత్రాలు అందుకున్న జిల్లా అధికారులు:
పోలీస్‌ పెరేడ్‌ గ్రౌండ్‌ నందు నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి కె.మోహన్‌ కుమార్‌, తిరువూరు ఆర్‌డివో వైవి ప్రశన్నలక్ష్మి, జిల్లా వ్యవసాయ అధికారిని యం విజయభారతి, డ్వామా పిడి జె. సునీత, పిఆర్‌ ఇఇ అక్కినేని వెంకటేశ్వరరావు, ఆర్‌డబ్ల్యూఎస్‌ సత్యనారాయణ, సోషల్‌ వెల్ఫెర్‌ ఇఇ బి. అనిల్‌ కుమార్‌, పొల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డు ఇఇ టి ప్రసాద్‌రావు, ఐసిడిఎస్‌ పిడి జి. ఉమాదేవి, డిఇవో సివి రేణుక, డిఐవో బి శ్రీనివాస్‌రావు, డియంహెచ్‌వో డా. యం సుహాసిని, జిజిహెచ్‌ సూపరింటెండెంట్‌ డా. సౌభాగ్యలక్ష్మి, డిస్ట్రిక్ట్‌ ఫైర్‌ ఆఫీసర్‌ యం శ్రీనివాస్‌రెడ్డి, బిసి వెల్ఫేÛర్‌ డిడి సిహెచ్‌ లక్ష్మి దుర్గ, డిఐపిఆర్‌వో యు. సురేంద్రనాద్‌, డిపిఆర్‌వో ఎస్‌వి మోహన్‌రావు, డిస్ట్రిక్ట్‌ ఎంప్లాయిమెంట్‌ ఆఫీసర్‌ పివి రమేష్‌కుమార్‌, డిస్ట్రిక్ట్‌ టూరిజం ఆఫీసర్‌ ఓ హేమచంద్ర, దుర్గామల్లేశ్వరస్వామి వార్ల దేవాస్థానం ఇవో డి. భ్రమరాంభ, జిల్లా ఖజాన అధికారి యంహెచ్‌ రెహమాన్‌ వివిధ శాఖలకు చెందిన అధికారులు ఉద్యోగులకు జిల్లా కలెక్టర్‌ ఎస్‌ డిల్లీరావు, జాయింట్‌ కలెక్టర్‌ ఎస్‌ నుపూర్‌ అజయ్‌, నగర పోలీస్‌ కమీసనర్‌ కాంతి రాణా టాటా డిసిపి విశాల్‌ గున్నిలు ప్రశంసా పత్రాలను అందజేసి అభినందించారు.

76వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఎన్‌టిఆర్‌ జిల్లా కలెక్టరేట్‌ ఆవరణంలో సోమవారం జిల్లా కలెక్టర్‌ ఎస్‌ డిల్లీరావు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం మహాత్మాగాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. స్వాతంత్య్ర ఉద్యమం కోసం పోరాటం చేసిన స్వాతంత్య్ర సమరయోధులను స్మరించుకుంటూ వారి ఆశయాలు సిద్ధించేలా ప్రతి ఒక్కరూ దేశాభివృద్ధిలో భాగ్యస్వామ్యులు కావాలన్నారు. త్రివర్ణ పతాకంలోని మూడు రంగులలో కాషాయం రంగు త్యాగాన్ని, తెలుపు స్వచ్చతను, ఆకుపచ్చ సాఫల్యాన్ని, అశోక్‌ చక్రం ధర్మాన్ని సూచిస్తాయని ప్రతి ఒక్కరూ త్యాగం స్వచ్చత సాఫల్యం ధర్మాన్ని పాటించి దేశభక్తిని చాటాలని కోరుతూ అధికారులకు, ఉద్యోగులకు స్వచ్చంద సంస్థల ప్రతినిధులకు జిల్లా ప్రజలకు జిల్లా కలెక్టర్‌ ఎస్‌ డిల్లీరావు స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు.
జెండా వందన కార్యక్రమంలో జాయింట్‌ కలెక్టర్‌ ఎస్‌ నుపూర్‌ అజయ్‌, డిఆర్‌వో కె.మోహన్‌కుమార్‌, కలెక్టరేట్‌ పరిపాలన అధికారి ఇంతియాజ్‌ పాషా, కలెక్టరేట్‌ అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

పేదలకు దుప్పట్లు పంపిణీ

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ముత్యాలంపాడు షిరిడి సాయిబాబా మందిరం ఆధ్వర్యంలో మందిర గౌరవధ్యక్షులు పి.గౌతమ్ రెడ్డి చేతుల …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *