-పరిసరాల పరిశుభ్రత, దోమల వృద్ది పై ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించాలి
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
వ్యక్తిగత పరిశుభ్రత పాటిస్తూ, తమ ఇంటి పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకుంటూ, ప్రతి శుక్రవారం డ్రై డే ను పాటించి దోమల నివారణకు ప్రజలు పూర్తి స్థాయిలో సహకరించాలని పశ్చిమ నియోజకవర్గ శాసన సభ్యులు వెల్లంపలి శ్రీనివాస్, మేయర్ రాయన భాగ్యలక్ష్మి, కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఐ.ఏ.ఎస్, పిలుపునిచ్చారు.
పరిసరాల పరిశుభ్రత, సీజనల్ వ్యాదుల పట్ల ప్రజలకు అవగాహన కల్పించుటకై సర్కిల్-1 పరిధిలోని కొత్తపేట కె.బి,ఎన్ కళాశాల నుండి ఏర్పాటు చేసిన అవగాహన ర్యాలీ ప్రారంభ కార్యక్రమములో పశ్చిమ నియోజకవర్గ శాసన సభ్యులు వెల్లంపలి శ్రీనివాస్, మేయర్ రాయన భాగ్యలక్ష్మి, కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఐ.ఏ.ఎస్, పలువురు కార్పొరేటర్లు అధికారులు పాల్గొన్నారు. నగరపాలక సంస్థ ద్వారా దోమల నివారణకై నగరంలో నిర్వహిస్తున్న యాంటి లర్వాల్ ఆపరేషన్, దోమలు పెరుగుదలకు గల కారణాలు వంటి అంశాలపై ఏర్పాటు చేసిన ప్రదర్శన పరిశీలించిన తదుపరి అవగాహన ర్యాలీని ప్రారంభించారు.
ఈ సందర్బంగా శాసన సభ్యులు వెల్లంపలి శ్రీనివాస్ మాట్లాడుతూ దోమల నివారణపై నిర్వహిస్తున్న అవగాహన ర్యాలీ ప్రజలకు ఎంతో దోహదపడుతుందని అన్నారు. వర్షాకాలం మరియు శీతాకాలంలో దోమల వృద్ది అధికంగా వ్యాప్తి చెందుటకు అవకాశం ఉంటుందని వివరిస్తూ, వారం రోజుల పాటుగా నగరపాలక సంస్థ ద్వారా నిర్వహిస్తున్న అవగాహన కార్యక్రమములో ప్రజలను భాగస్వాములను చేసి నీటి నిల్వలు ఉండకుండా, పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోనుచూ, దోమ కాటువల్ల వచ్చు వ్యాదుల పట్ల మరియు నివారణ చర్యల పట్ల అవగాహన కల్గియుండి అప్రమ్మత్తంగా ఉండాలని అన్నారు.
అదే విధంగా మేయర్ మాట్లాడుతూ రాయన భాగ్యలక్ష్మి నగరపాలక సంస్థ ప్రజారోగ్య శాఖ దోమల నివారణకై అనేక చర్యలు తీసుకునప్పటికి, ప్రజలు కూడా అధికారులతో సహకరించి వ్యక్తిగత పరిశుభ్రత పాటిస్తూ, ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుంటూ, ప్రతి శుక్రవారం డ్రై డే ను పాటించి దోమల నివారణకు పూర్తి స్థాయిలో తోడ్పాటు అందించాలని అన్నారు. వారం రోజుల పాటుగా దోమలపై దండయాత్ర కార్యక్రమము ద్వారా ప్రజలలో దోమల లార్వా వృద్ది చెందు అంశాలపై అవగాహన కార్యక్రమములు నిర్వహించుట జరుగుతుందని అన్నారు. నీటి నిల్వల వల్లే మలేరియా వ్యాధి ప్రబలుతుందని, దోమల లార్వా కేవలం మన ఇంటి పరిసరాలలో నిరుపయోగంగా ఉన్న వస్తువులలో, వాడి పారేసిన కొబ్బరి బొండాలలో, మూతలు లేని ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్ లలో, టైర్లు, పనిరాని సమగ్ర, పూల కుండీలలో వర్షపు నీటిలో మరియు నిల్వ ఉన్న వాడుకపు నీటిలో దోమల లార్వా ఉత్పత్తి చెందుతుందని అన్నారు.
కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఐ.ఏ.ఎస్, మాట్లాడతూ ప్రజలు దోమకాటు వచ్చు వ్యాదుల బారినపడకుండా పరిసరములు పరిశుభ్రముగా ఉంచుకోవాలని, దోమల వ్యాప్తి కేవలం వాడుకపు నీరు నిల్వ ఉన్నచోట్ల లార్వా వృద్ధి చెందుతుందని, నివాసాలలో వాడుకపు నీరు నిల్వలు ఉండకుండా డ్రై డే ఫ్రైడే పాటించాలని అన్నారు. నగరంలో దోమల నివారణకై ప్రతి రోజు హ్యాండ్ మరియు లితో ఫోగ్గింగ్ యంత్రముల ద్వారా ఫాగింగ్ నిర్వహిస్తూ, నీరు నిల్వ యున్న ప్రదేశములలో ఆయిల్ బాల్స్ వేయుట, పి.డి.పి. వర్క్, లార్వా గుర్తించిన ప్రదేశాలలో మరియు కల్వర్డ్ ల క్రింద పై రత్రం పవర్ స్ప్రేతో స్ప్రే చేయించుట మొదలగు యాoటిలార్వల్ ఆపరేషన్స్ పనులు నిర్వహించుట జరుగుచున్నదని అన్నారు. దోమ లార్వా వృద్ది, నివారణకు తీసుకొనవలసిన జాగ్రత్త చర్యలపై సచివాలయ సిబ్బంది ద్వారా ప్రతి ఇంటికి అవగాహన కల్పించే దిశగా ఆదేశాలు ఇవ్వటం జరిగిందని అన్నారు
అనంతరం అవగాహన ర్యాలీని మేయర్ ప్రారంభించగా, ప్రజాప్రతినిధులు, అధికారులు, మలేరియా, ప్రజారోగ్య సిబ్బంది, ఆరోగ్య సిబ్బంది, సచివాలయం సిబ్బందితో కలసి ప్లే కార్డ్ లను పట్టుకొని పరిసర ప్రాంతాలలో ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమములో పలువురు కార్పొరేటర్లు, డి.యం.ఓ.హెచ్ డా.సుహాసిని, చీఫ్ మెడికల్ ఆఫీసర్ డా.పి.రత్నావళి, బయాలజిస్ట్ డా.బాబు శ్రీనివాసన్ మరియు ఇతర అధికారులు పాల్గొన్నారు.