విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ప్రజా సమస్యల పరిష్కారానికి పెద్దపీట వేస్తూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పరిపాలన సాగిస్తున్నారు అని ఆ పార్ట్ తూర్పు నియోజకవర్గ ఇన్ ఛార్జ్ దేవినేని అవినాష్ పేర్కొన్నారు. శుక్రవారం గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా 22వ డివిజన్,110 సచివాలయం పరిధిలోని స్వర్గపురి 5,6 వీధులలో మరియు మలేరియా హాస్పిటల్ రోడ్ ప్రాంతాల్లో ఇంటింటికి పర్యటించిన అవినాష్ ప్రభుత్వం ద్వారా అందుతున్న సంక్షేమ పథకాలు, చేస్తున్న అభివృద్ధి గురుంచి ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత పేదవారికి కార్పొరేట్ వైద్యం,చదువు ఉచితంగా అందుతుంది అని,మాలాంటి పేదవారికి అండగా ఎన్నో సంక్షేమ పధకాలు అమలు చేస్తున్న జగన్ మరో 30ఏళ్ళు ముఖ్యమంత్రి గా ఉండాలని ప్రజలు కోరుకొంటూ తమ ఆశీర్వాదాలు అందిస్తూ మాకు ఘన స్వాగతం పలుకుతున్నారని సంతోషం వ్యక్తం చేశారు. ప్రభుత్వనికి ప్రజలలో రోజురోజుకు పెరుగుతున్న ఆదరణ చూసి ఓర్వలేక తమ రాజకీయ మనుగడ కోసం తెలుగుదేశం పార్టీ రాష్ట్రంలో శాంతిభద్రతల కు విఘాతం కలిగిస్తూ అబద్ధపు ప్రచారాలు చేస్తున్నారు అని విమర్శించారు. కేవలం సోషల్ మీడియాలో, తమ అనుకూల మీడియాలో రోజు కనపడలని స్థానిక ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ప్రభుత్వం మీద విమర్శలు చేస్తూ డ్రామాలు ఆడుతున్నారని, గత ప్రభుత్వం లో అధికారంలో ఉండి నియోజకవర్గ అభివృద్ధికి మీరు ఏమి చేశారో చెప్పగలరా అని అవినాష్ ప్రశ్నించారు.ఈ ప్రాంతంలో శ్మశానం వుండటం వల్ల గత 40ఏళ్లుగా ఇక్కడి ప్రజలు ఎదుర్కొంటున్న ఇంటి పట్టాల సమస్య గురించి ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లగా తక్షణమే ఆయన సమస్య పరిష్కారానికి అధికారులను అదేశించారని వీలైనంత త్వరగా ఆ సమస్య పరిష్కారం అవుతుంది అని భరోసా ఇచ్చారు. కొండారెడ్డి కార్పొరేటర్ అయ్యాక నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేయడంతో పాటు డివిజన్ అభివృద్ధి పనులు గురించి కోట్ల రూపాయలు నిధులు వచ్చేలా పనిచేస్తూ డివిజన్ ను అభివృద్ధి పథంలో నడిపిస్తూన్నరని కొనియాడారు. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి ఇంటి వద్దకే వలంటీర్ లు సంక్షేమ లబ్ది అందజేస్తున్నారు అని అన్నారు. ప్రతిపక్షాలు ఎన్ని కుట్రలు చేసిన ప్రజలు నమ్మే పరిస్థితి లేదని అవినాష్ తెలిపారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గ, 22వ డివిజన్ కార్పొరేటర్ తాటిపర్తి కొండారెడ్డి, గాంధీ కోపరేటివ్ బ్యాంక్ డైరక్టర్ జోగా రాజు, వైస్సార్సీపీ నాయకులు శ్రీనివాస్ రెడ్డి, నాగిరెడ్డి, రమణారెడ్డి, చెన్నారెడ్డి, ఫజులుద్దీన్, జావీద్, సమతం కాళీ, దర్గా తదితరులు పాల్గొన్నారు.
Tags vijayawada
Check Also
ప్రతి నెలా చేనేత ఎగ్జిబిషన్లు ఏర్పాటు
-మంత్రి సవిత వెల్లడి -నికె హ్యాండ్లూమ్ మార్కెటింగ్ ఎక్స్ పో 2024-25 ను ప్రారంభించిన మంత్రి -నేతన్నలకు 365 రోజులు …