Breaking News

ఆర్థిక సహాయం అందజేత

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ నగరంలో స్వర్గీయ దేవినేని నెహ్రూ చారిటిబుల్ ట్రస్ట్ ద్వారా ఎందరో నిరుపేదలకు జీవనోపాధి కల్పించడం తో పాటు ఎన్నో సామాజిక సేవ కార్యక్రమాలు చేపడుతున్నట్టు తూర్పు నియోజకవర్గ వైస్సార్సీపీ ఇన్ ఛార్జ్ దేవినేని అవినాష్ పేర్కొన్నారు. శుక్రవారం నాడు తూర్పు నియోజకవర్గ పరిధిలోని 22వ డివిజన్,బైరెడ్డి వారి స్ట్రీట్ కి చెందిన తుమ్మలపల్లి రాజేశ్వరి కి వైద్య ఖర్చుల నిమిత్తం దేవినేని నెహ్రూ ట్రస్ట్ ద్వారా 5,000 రూపాయల నగదును దేవినేని అవినాష్ చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా అవినాష్ మాట్లాడుతూ గడప గడప మన ప్రభుత్వంలో భాగంగా ఈ నెల 24వ తేదీన బైరెడ్డి వారి స్ట్రీట్ లో పర్యటించినప్పుడు స్థానిక కార్పొరేటర్ కొండారెడ్డి వారికీ మెడిసిన్స్ అవసరం ఉందని అవినాష్ దృష్టికి తీసుకురాగా వారికి ఆర్థిక సహాయం చేయడం జరిగింది అని పేర్కొన్నారు. నాన్నగారు దేవినేని నెహ్రు గారి సేవా స్పూర్తితో మా చారిటీ సంస్థ ద్వారా ఎన్నో వేల మందికి ఉపాధి, విద్య రంగాలలో అండగా నిలుస్తున్నాం అని అన్నారు .రాబోయే రోజుల్లో కూడా మా సేవా కార్యక్రమాలు ఇలాగే నిరాటంకంగా జరుపుతామని నా పూర్తి సహాయసహకారాలు ఉంటాయని అవినాష్ తెలిపారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *