విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
మాననీయ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ను ఆంధ్రప్రదేశ్ అధికార భాషా సంఘం అధ్యక్షుడు అచార్య యార్లగడ్డ లక్ష్మి ప్రసాద్ శుక్రవారం విజయవాడ రాజ్ భవన్ లో మర్యాద పూర్వకంగా కలిసారు. పాలనా భాషగా తెలుగు అమలుకు సంబంధించి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మార్గనిర్దేశకత్వంలో తెలుగు భాషా ప్రాధికార సంస్ధ అమలు చేస్తున్నకార్యాచరణను గురించి యార్లగడ్డ గవర్నర్ కు వివరించారు. రాజ్ భవన్ పరిపాలనా వ్యవహారాలలో సైతం తెలుగు అమలయ్యేలా చూడాలని ఈ సందర్భంగా గవర్నర్ కు విన్నవించారు. యార్లగడ్డ వినతిపై గవర్నర్ హరిచందన్ సానుకూలంగా స్పందించారు. కార్యక్రమంలో గవర్నర్ వారి ప్రత్యేక ప్రధానకార్యదర్శి ఆర్ పి సిసోడియా తదితరులు పాల్గొన్నారు.
Tags vijayawada
Check Also
ప్రతి నెలా చేనేత ఎగ్జిబిషన్లు ఏర్పాటు
-మంత్రి సవిత వెల్లడి -నికె హ్యాండ్లూమ్ మార్కెటింగ్ ఎక్స్ పో 2024-25 ను ప్రారంభించిన మంత్రి -నేతన్నలకు 365 రోజులు …