గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
ఎన్నికల సంఘం వారి ఉత్తర్వుల మేరకు దేశంలోని ప్రతి ఓటరు తమ ఓటరు కార్డ్ కు ఆధార్ అనుసంధానం చేసుకోవాలని, బూత్ లెవల్ అధికారులు (బి.ఎల్.ఓ.) ఓటర్లకు అవగాహన కల్గించాలని నగర కమిషనర్ మరియు ఎలక్టోరల్ రిజిస్టార్ ఆఫీసర్ (ఈ.ఆర్.ఓ.) కీర్తి చేకూరి ఐఏఎస్ అన్నారు. ఆదివారం స్పెషల్ క్యాంపెయిన్ డే లో భాగంగా బి.ఎల్.ఓ.లు తమ పరిధిలోని పోలింగ్ కేంద్రాల్లో ఓటర్ కార్డ్ కు ఆధార్ అనుసంధానం చేసే ప్రక్రియను టి.జె.పి.ఎస్. కాలేజి, రామన్న పేటలోని 119 సచివాలయంను ఆకస్మిక తనిఖీ చేశారు. తొలుత ఆయా పోలింగ్ కేంద్రాల పరిధిలో బి.ఎల్.ఓ.ల వివరాలు, వారి పరిధిలో ఓటర్ల వివరాలు, ఇప్పటి వరకు ఆధార్ తో ఓటర్ కార్డ్ అనుసంధానం చేసుకున్న శాతం తదితర వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ చీఫ్ ఎలక్ట్రోల్ ఆఫీసర్ ఆదేశాల మేరకు గుంటూరు పశ్చిమ(94)మరియు తూర్పు (95)నియోజకవర్గాల పరిధిలో ఓటర్లకు ఆధార్ అనుసంధానం కోసం బి.ఎల్.ఓ.లు తమ పోలింగ్ కేంద్రాల్లో ఉదయం 10 నుండి సాయంత్రం 5 గంటలకు వరకు అందుబాటులో ఉండాలని ఆదేశించారు. అలాగే తమ పరిధిలోని ఓటర్లను తమ ఆధార్ కార్డ్ కి ఓటర్ కార్డ్ ని అనుసంధానం చేసుకునేలా అవగాహన కల్గించాలన్నారు. అలాగే పోలింగ్ కేంద్రానికి రాకుండా కూడా ఓటర్లు ఆన్ లైన్ లో ఓటర్ హెల్ప్ లైన్, ఎన్.వి.ఎస్.పి. యాప్ లను డౌన్ లోడ్ చేసుకొని నేరుగా ఓటు కార్డ్ కు ఆధార్ ను అనుసంధానం చేసుకునే విధానం కూడా తెలియచేయాలన్నారు. పర్యటనలో నగరపాలక సంస్థ అదనపు కమిషనర్ (ఎఫ్.ఎస్.సి.) డి.శ్రీనివాసరావు, బి.ఎల్.ఓ. సూపర్వైజర్లు పాల్గొన్నారు.
Tags guntur
Check Also
సత్యసాయి జిల్లాలో జరిగిన ప్రమాదంపై మంత్రి అచ్చెన్నాయుడు విచారం
-గొర్రెల కాపరి ఓబులపతికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించిన మంత్రి అచ్చెన్నాయుడు -రహదారి ప్రమాదంలో గొర్రెల కాపరి ఓబులపతికి …