-ఏళ్ల తరబడి పెండింగ్ లో ఉన్న విస్తరణ పనుల్లో పురోగతి
-దీర్ఘకాలంగా ఉన్న సమస్యల పరిష్కారానికి అధిక ప్రాధాన్యత
-నగరాభివృద్ధిలో కీర్తి ఐఏఎస్ మార్క్
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
గుంటూరు నగరం విస్తృతంగా పెరిగిన జనాభా, ట్రాఫిక్ కి వలన ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. అందుకు అనుగుణంగా ఏళ్లతరబడి పెండింగ్ లో ఉన్న రోడ్ల విస్తరణ పనులు ప్రస్తుతం వేగవంతం అయ్యాయి. గుంటూరు నగర కమిషనర్ గా కీరి చేకూరి భాధ్యతలు తీసుకున్న నాటి నుండి నగర ప్రజలు దీర్ఘకాలంగా ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. నగరంలో ప్రధాన రహదారుల విస్తరణ గత కృష్ణా పుష్కరాల తర్వాత జరగక పోవడం, జరిగిన ప్రాంతాల్లో సంపూర్ణంగా చేయకపోడం వలన రోజు రోజుకి పెరుగుతున్న ట్రాఫిక్ కి నగర ప్రజలు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు. ప్రజల ఇబ్బందులు గమనించిన కమిషనర్ రోడ్ల విస్తరణ పనుల వేగవంతం పై దృష్టి సారించి, విస్తరణ పనులకు కీలకమైన పట్టణ ప్రణాలిక విభాగంలో అవసరమైన అధికారులను ప్రభుత్వంతో చర్చించి నియామకం చేశారు. ఈ క్రమంలో ఏక కాలంలో నగరంలోని ప్రధాన సమస్యాత్మక రోడ్లను గుర్తించి తోలివిడతగా నందివెలుగు రోడ్, కుగ్లర్ హాస్పిటల్ రోడ్, పెద్ద పలకలూరు రోడ్, ఏటి.అగ్రహారం రోడ్ ల విస్తరణకు ఆర్.డి.పి.ల ప్రకారం రోజువారీ కార్యాచరణ ప్రణాళిక సిద్దం చేశారు. రోడ్ల వారిగా ఏ.సి.పి.లను ప్రత్యేక అధికారులుగా నియమించి, ప్రతి రోజు విస్తరణ పనుల పై సమీక్ష చేస్తూ క్షేత్ర స్థాయిలో పనులను వేగవంతం చేశారు.
నందివెలుగు రోడ్ : షుమారు 5 ఏళ్ల నుండి కొనసాగుతున్ననందివెలుగు రోడ్ విస్తరణ పనులు ముందుకు సాగకపోవడం వలన స్థానికులు, వాహన చోదకులకు, ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురి అవ్వడంను కమిషనర్ నేరుగా క్షేత్ర స్థాయి పర్యటనలో విస్తరణకు అడ్డుగా ఉన్న ప్రభావిత భవనాలను గమనించి, సదరు యజమానులతో చర్చించి, వారి ఆమోదంతో నిర్మాణాల తొలగింపు చేపట్టారు. నష్ట పోతున్న వారికి షుమారు రూ.3.49 కోట్ల నష్ట పరిహారం ఇచ్చారు. బస్టాండ్ దగ్గరి ఎన్.టి.ఆర్. సర్కిల్ నుండి వెంకటేశ్వర స్వామీ దేవాలయం వరకు 1.11 కిలో మీటర్ల మేర రెండు వైపులా 176 నిర్మాణాలను తొలగించి ఆర్.డి.పి. ప్రకారం పనుల వేగవంతంకు చర్యలు తీసుకుంటున్నారు.
కుగ్లర్ హాస్పిటల్ రోడ్ : కొత్తపేట శివాలయం నుండి నెహ్రు నగర్ రైల్వే గేటు వరకు దీర్గాకాలంగా ఉన్న ట్రాఫిక్ సమస్యకు శాశ్వత పరిష్కారం 2018లో ప్రారంభించి, రోడ్ విస్తరణ వలన నష్టపోతున్న యజమానులకు టి.డి.ఆర్.బాండ్ల పంపిణీ పూర్తీ అయినప్పటికీ పనులు ఆదిలోనే నిలిచాయి. ట్రాఫిక్ సమస్యలను తమ దృష్టికి వచ్చిన వెంటనే విస్తరణ పనుల పై సమావేశం ఏర్పాటు చేసి, పనులను ప్రారంభించారు. 450 మీటర్ల మేర మాస్టర్ ప్లాన్ ప్రకారం 60 అడుగులకు విస్త్రరణ పనులు జరుగుతున్నాయి. ఇప్పటి వరకు విస్తరణ ప్రభావితమయ్యే 46 భవనాలకు రూ. 2.63 కోట్లు నష్ట పరిహారం అందించడానికి చర్యలు తీసుకున్నారు. 46 భవనాల్లో ఇప్పటికి 27 తొలగించడం జరిగింది.
పెద్ద పలకలూరు రోడ్ : గుంటూరు నగరం నుండి నరసరావు పేట, సత్తెనపల్లి వెళ్లడానికి వీలుగా ఉండే పెద్ద పలకలూరు రోడ్ విస్తరణ పనులు వేగంగా జరిగేలా చర్యలు తీసుకున్నారు. నగరపాలక సంస్థ గుజ్జనగుండ్ల జంక్షన్ నుండి నగరపాలక సంస్థ రోడ్ బౌండరి వరకు డివైడర్ డ్రైన్ టు డ్రైన్ వరకు రోడ్ విస్తరణ పనులు పూర్తీ చేసి, రోడ్ నిర్మాణం చేయడం జరిగింది. రత్నగిరి కాలనీ నుండి పెద్ద పలకలూరు పాత రైల్వే లైన్ వరకు ఫేజ్ 1, అక్కడి నుండి పెద్ద పలకలూరులోని నగరపాలక సంస్థ పరిధిలోని అర్బన్ హెల్త్ సెంటర్ వరకు గల రోడ్ ని మరో 2 ఫేజ్ లుగా జోనల్ డెవలప్మెంట్ ప్లాన్ ప్రకారం 80 అడుగులకు విస్తరణ పనులు వేగంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా మొదటి ఫేజ్ విస్తరణలో నష్ట పోతున్న 57 ప్రైవేట్ భవనాలకు రూ.2.43 కోట్లను నష్ట పరిహారంగా అందించడానికి అంచనాలు సిద్దం చేయడం జరిగింది. సదరు రోడ్ ఆర్.అండ్ బి రోడ్ అయినందున, తాత్కాలిక మరమత్తులను సదరు శాఖ నిర్వహించడం జరిగింది.
ఏ.టి.అగ్రహారం మెయిన్ రోడ్ : బ్రాడిపేట, కోబాల్ట్ పేట, కృష్ణ నగర్, అశోక్ నగర్, లక్ష్మిపురం తదితర ప్రాంతాల నుండి చిలకలూరిపేట, నరసరాపేటలకు వెళ్ళే ప్రధానమైన చుట్టగుంట జంక్షన్ వరకు ఆర్.డి.పి. ప్రకారం షుమారు 1.9 కిలో మీటర్లు 80 అడుగుల రోడ్ విస్తరణ పనులు వేగవంతం జరుగుతుంది. ఇప్పటికే ఆక్రమణలు, స్వాధీనాల తొలగింపు పూర్తి అయింది. త్వరలో విస్తరణ పనుల వలన ప్రభావిత భవనాలకు నష్ట పరిహారం అందించి పనులు వేగవంతంకు కమిషనర్ నేరుగా పర్యవేక్షణ చేస్తున్నారు. పనులు పూర్తి అయిన వెంటనే విద్యుత్ స్తంభాలు షిఫ్టింగ్ చేపట్టి, డివైడర్ తో డ్రైన్ టు డ్రైన్ రోడ్ నిర్మాణం చేపడతామన్నారు.
రామనామ క్షేత్రం రోడ్ : నగరంలో అధిక ట్రాఫిక్ ఉండే రోడ్లలో రామనామ క్షేత్రం రోడ్ కూడా కీలకమైనది. సంపత్ నగర్, శ్రీనివాసరావుతోట, కే.వి.పి.కాలని తదితర ప్రాంతాలకు ఈ రోడ్ అభివృద్ధి వలన తేలికగా రాకపోకలు చేసుకునే వీలు ఏర్పడుతుంది. ప్రస్తుతం ఈ రోడ్ ని మాష్టర్ ప్లాన్ ప్రకారం 80 అడుగులకు షుమారు 450 మీటర్ల మేర విస్తరణ పనులు వేగంగా జరుగుతున్నాయి. విస్తరణ ప్రభావిత భవనాల తొలగింపు పూర్తీ అయి యు.జి.డి.పనులు, స్ట్రీట్ లైటింగ్ పనులు జరుగుతున్నాయి.